Vastu Tips: కొత్తేడాది ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి.. ఆర్థికంగా బిందాస్‌గా ఉండండి.

|

Dec 18, 2022 | 6:35 AM

చిన్న ఇంటి నుంచి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం వరకు వాస్తును తప్పనిసరిగా ఫాలో అవుతుంటారు. ఇంట్లో నివసించే వారిపై ఇంటి వాస్తు ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. కేవలం నిర్మాణంలో వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా..

Vastu Tips: కొత్తేడాది ఇంట్లోకి ఈ వస్తువులు తెచ్చుకోండి.. ఆర్థికంగా బిందాస్‌గా ఉండండి.
Home Vastu Tips
Follow us on

చిన్న ఇంటి నుంచి పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌ల నిర్మాణం వరకు వాస్తును తప్పనిసరిగా ఫాలో అవుతుంటారు. ఇంట్లో నివసించే వారిపై ఇంటి వాస్తు ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు. కేవలం నిర్మాణంలో వాస్తు మాత్రమే కాకుండా ఇంట్లో ఉండే వస్తువుల వల్ల కూడా వ్యక్తులపై ప్రభావం ఉంటుందనేది వాస్తు నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఆర్థికంగా బాగుండాలంటే ఇంట్లో కచ్చితంగా కొన్ని వస్తువులు ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు. మరో రెండు వారాల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. మరి ఇలాంటి తరుణంలో కొత్తేడాదిలో ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా సంతోషంగా సాగాలంటే ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకోమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ వస్తువులు ఏంటి.? వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి.? ఇప్పుడు తెలుసుకుందాం..

* ఇంట్లో చిన్న చిన్న వాస్తు దోషాలు ఉంటే పిరమిడ్‌ను ఉంచడం వల్ల ప్రతికూల ప్రభావం తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. వెండి, ఇత్తడి, రాగి వీటిలో దేనిని ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయని చెబుతున్నారు. ఇంట్లో హాల్‌లో ఈ పిరమిడ్‌ను ఏర్పాటు చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

* హనుమంతుడు ధైర్యానికి ప్రతీకగా చెబుతుంటారు. ఈ కొత్త ఏడాది మీకు అన్ని విధాల కలిసిరావాలంటే ఇంట్లో పంచముఖి హనుమాన్‌ ఫొటోను ఏర్పాటు చేసుకోండి. ఇంట్లో నెగిటివిట్‌ దూరమై, ఆర్థికంగా బలోపేతమవుతారు. నైరుతి దిశలో ఫొటోను ఏర్పాటు చేసుకుంటే మంచిది.

ఇవి కూడా చదవండి

* ఇక పూజా గదిలో లక్ష్మీ, కుబేరుడి విగ్రహాలు ఉండేలా చూసుకోండి. వీటిని ప్రతిరోజూ పూజించడం ద్వారా ఐశ్వర్యానికి ఎలాంటి లోటు ఉండదు. ఆర్థికంగా స్థిరత్వం వస్తుంది.

* వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉత్తర దిశలో నిత్యం నీటితో ఉండే ఒక బిందె కానీ కుజాను కానీ ఉంచుకోవాలి. దీనివల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోవడంతో పాటు, ఆదాయ వనరులు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నోట్: పైన తెలిపిన అంశాలు వాస్తు నిపుణుల సూచన మేరకు అందించినవి మాత్రమే. ఈ అంశాల్లో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..