హిందూ మతంలో దేవతలకు ప్రకృతితో లోతైన సంబంధం ఉంది. దేవతలు, దేవుళ్ల పూజలో మనం ప్రకృతి నుండి పొందిన వస్తువులను ఉపయోగిస్తాము. దేవతలను పూజించడమే కాకుండా చెట్లను, మొక్కలను పూజించే సాంప్రదాయం కూడా ఉంది. దేవతలు చెట్లలో నివసిస్తారని హిందూ పురాణాలు చెబుతున్నాయి. చెట్లు, మొక్కలను పూజిస్తే అవి మనకు అనేక రకాల పండ్లు లభిస్తాయి. వీటితో పాటు ఐశ్వర్యం, దీర్ఘాయువు మీ సొంతం అవుతాయి. ముఖ్యంగా ఉసిరి(గూస్బెర్రీ), తులసి,అరటి చెట్లు విష్ణువు, లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ చెట్లలో విష్ణుమూర్తి,లక్ష్మి దేవి నివాసం ఉంటారని చెబుతారు. దేవుళ్లు, దేవతలకుసంబంధించిన కొన్ని రకాల చెట్ల గురించి తెలుసుకుందాం..
1. ఉసిరి, తులసి, అరటి చెట్లు శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవితో సంబంధం కలిగి ఉన్నాయని నమ్ముతారు. ఈ చెట్లలో విష్ణువు మూర్తితో పాటుగా ఆ లక్ష్మి దేవి నివసిస్తుందని చెబుతారు. మీరు శ్రీమహావిష్ణువును ప్రసన్నం చేసుకోవాలంటే ఏకాదశి నాడు ఉసిరి చెట్టును పూజించాలి. గురువారం అరటి మొక్కకు పూజ చేయాలి. అరటి మొక్కకు పసుపు కలిపిన నీటిని నైవేద్యంగా పెట్టడం ద్వారా ఇంట్లో ఐహిక సౌఖ్యం పెరుగుతుంది. ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని శివుడు, మహా విష్ణువు, లక్ష్మి అమ్మవారిని పూజించడం ద్వారా మీకు అధిక ధన ప్రాప్తి కలుగుతుంది. పేదలకు, బ్రాహ్మణులకు ఉసిరి దానం చేయటం కూడా చాలా మంచిది. ఈ పరిహారంతో మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం, బ్రాహ్మణులకు భోజనం పెట్టించినా లక్ష్మీ దేవిని సంతోషపరిచినట్టేగా చెబుతారు.
2. బిల్వపత్రం, మర్రి చెట్టు శివునితో సంబంధం కలిగి ఉన్నట్లు విశ్వాసం. మర్రిచెట్టుపై బ్రహ్మ, విష్ణువు, శివుని నివాసై ఉంటారని నమ్ముతారు. మర్రిచెట్టును చూడటం శివుని దర్శనంతో సమానంగా చెబుతున్నారు. మహిళలు ఈ చెట్టును పూజించడం ద్వారా తమ భర్తలు దీర్ఘాయువును పొందుతారు. త్రయోదశి నాడు మర్రి చెట్టును పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు, శ్రేయస్సు పెరుగుతాయని చెబుతారు.శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి బిల్వపత్రాన్ని నైవేద్యంగా సర్పించాలి. ఆ లక్ష్మీ దేవి ఈ చెట్టు వేరులో నివసిస్తుందని నమ్ముతారు. అందుకే బిల్వ వృక్షాన్ని పూజిస్తే మీకు ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇలా చేయడం వల్ల భక్తుల కోర్కెలు నెరవేరుతాయి.
3. హిందూ మతంలో శమీ వృక్షానికి(జమ్మీ) చాలా ప్రాముఖ్యత ఉంది. ఇంట్లో పండించడం వల్ల సంతోషం, ఐశ్వర్యం పెరుగుతాయి. దీనితో పాటు ప్రతిరోజూ శివునికి దాని ఆకులను నైవేద్యంగా పెట్టడం ద్వారా విశ్వనాథుని అనుగ్రహం మీపై ఉంటుంది. ప్రతి శనివారం నాడు జమ్మి చెట్టుపై ఆవనూనెతో దీపాన్ని వెలిగించడం ద్వారా మీ ఇంట్లో అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాకుండా మీరు ఆనందం, శ్రేయస్సు పొందుతారు. దుష్ట శక్తులు నాశనమవుతాయి.
4. కదంబ వృక్షం: శ్రీకృష్ణుడి లీల గురించి చాలా వర్ణనలను వినే ఉంటారు. కానీ, శ్రీ మహాలక్ష్మీ కదంబ వృక్షంపై నివసిస్తుందని భక్తులు నమ్ముతారు. కదంబ వృక్షం కింద కూర్చుని యజ్ఞం చేసిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు. అలాంటి ఇంట్లో ఎప్పుడూ డబ్బుకు లోటు ఉండదంటారు.
5. రావి చెట్టు : వేదాల్లో రావి చెట్టు గురించి ఎంతో గొప్పగా చెప్పబడింది. ఈ చెట్టుకు కేవలం ప్రదక్షిణం చేయడం వల్ల కాలసర్పదోషం వంటి ఇతర గ్రహాల దోషాలు తొలగిపోతాయి. పురాణాల ప్రకారం.. రావి చెట్టు మూలంలో విష్ణువు, కాండంలో కేశవుడు, కొమ్మలలో నారాయణుడు, ఆకులలో శ్రీ హరి మరియు పండ్లలో సకల దేవతలు ఉంటారన్నది విశ్వాసం. మీరు ప్రతిరోజూ రావి చెట్టుకు నీరు పోసి.. ఆదివారం మినహా మిగతా రోజుల్లో దాని మూలాన్ని తాకినట్లయితే మీకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అనేక వ్యాధులు దూరమవుతాయని భక్తుల విశ్వాసం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..