Dreams : నిద్రించేటపుడు వచ్చే కలలు మంచి, చెడు రెండింటి గురించి వివరిస్తాయి. అయితే మనకు మెలకువ రాగానే చాలా కలలు మర్చిపోతాము కానీ కొన్ని ఆశ్చర్యకరమైన కలలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కలలో కనిపించే కొన్ని సంకేతాల ద్వారా భవిష్యత్‌లో ఏం జరుగబోతుందో తెలుసుకోవచ్చు. అయితే త్వరలో మీరు ధనవంతులు కాబోతున్నారని తెలిపే కొన్ని సంకేతాలు కలలో మీరు చూస్తారు. అవి ఎటువంటివో ఒక్కసారి తెలుసుకుందాం.
1. కలలో మీరు ఆకాశంలో నల్లటి మేఘాలను చూస్తే వ్యాపారాన్ని కోల్పోవచ్చు.
2. మీ కలలో మీ కార్యాలయం, దుకాణం లేదా కర్మాగారం మంటల్లో కాలిపోతున్నట్లు చూస్తే అస్సలు భయపడకండి. ఎందుకంటే త్వరలో వ్యాపారం ప్రారంభిస్తారని అర్థం.
3. కలలో తేనెటీగ కనిపిస్తే మీరు ఎక్కడి నుంచైనా డబ్బు పొందబోతున్నారని అర్థం చేసుకోండి .
4. కలలో ఏనుగు, ఎద్దు , సింహం, సముద్రం చూడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. త్వరలో డబ్బు అందుకోబోతున్నారని అర్థం.
5. మీరు కలలో వంతెన దాటుతున్నట్లు అనిపిస్తే ఆర్థిక చింతల నుంచి బయటపడబోతున్నారని అర్థం. వ్యాపారంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని చెబుతారు.
6. కలలో మీ చొక్కా బటన్ కుట్టడం చూస్తే త్వరలో మీరు డబ్బు సంపాదించబోతున్నారని అర్థం. కానీ చొక్కా బటన్ విరిగి అదే కలలో పడితే మీరు డబ్బు నష్టపోయే అవకాశం ఉందని అర్థం.
7. మీరు కలలో పసుపు లేదా వివాహం చూస్తే త్వరలో ఎక్కడి నుంచైనా డబ్బు వస్తుందని అర్థం.
8. ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తించండి.