మహారాష్ట్రలో తెరచుకున్న ప్రార్థనామందిరాలు, షిర్డీ సాయిబాబా గుడిలో ఆరు వేల మంది భక్తులకే అనుమతి!

మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి.. నిజానికి జూన్‌లోనే ప్రార్థనా స్థలాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు..

మహారాష్ట్రలో తెరచుకున్న ప్రార్థనామందిరాలు, షిర్డీ సాయిబాబా గుడిలో ఆరు వేల మంది భక్తులకే అనుమతి!
Follow us

|

Updated on: Nov 16, 2020 | 12:19 PM

మహారాష్ట్రలో ప్రార్థనామందిరాలు తెరచుకున్నాయి.. నిజానికి జూన్‌లోనే ప్రార్థనా స్థలాలను తెరుచుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం ఆ సాహసం చేయలేదు.. ఇప్పుడు కరోనా తీవ్రత కాస్త తగ్గడంతో ప్రభుత్వం కొన్ని షరతులతో ప్రార్థనాస్థలాలను తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది.. సుప్రసిద్ధ షిర్డీ సాయిబాబా దేవస్థానం తెరచుకోవడంతో భక్తులు ఆ క్షేత్ర దర్శనం కోసం ఉత్సాహం చూపుతున్నారు.. ఆలయాలలో భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని, మాస్కులను కచ్చితంగా ధరించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే షిర్డీ సాయిబాబా ఆలయంలో రోజూ ఆరు వేల మంది భక్తులకు మాత్రమే అనుమతినిస్తున్నారు. కౌంటర్లతో పాటు, ఆన్‌లైన్‌ టికెట్లు జారీ చేస్తున్నట్టు షిర్డీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ తెలిపింది. అలాగే 65 ఏళ్లు దాటినవారికి, పదేళ్లలోపు చిన్నారులకు అనుమతి లేదని చెప్పింది. అలాగే ముంబాయిలోని సుప్రసిద్ధ సిద్ధి వినాయక ఆలయం, పూణేలోని దాద్‌గుషెత్‌ హల్వాయి గణపతి ఆలయం కూడా భక్తుల కోసం తెరచుకున్నాయి.. కరోనా కారణంగా మార్చి నుంచి ఆలయాలు మూతబడ్డాయి.. భక్తులకు అనుమతి ఇవ్వలేదు.. అయితే ఆలయాల్లో నిత్యపూజలు మాత్రం యథావిధిగా జరిగాయి..

Latest Articles
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఫిక్స్‌డ్ డిపాజిట్ నుంచి నెలవారీ వడ్డీని ఎలా పొందాలి ?
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
ఎంఐఎం - కాంగ్రెస్ కార్యకర్తల మధ్య కత్తుల దాడి.. ఒకరు మృతి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
స్కూల్‌కు లేట్‌గా వచ్చిందని.. టీచర్‌పై ప్రిన్సిపాల్‌ దాడి
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
జియోలో వార్షిక రీఛార్జ్‌ ప్లాన్స్‌ ఎలా ఉన్నాయో తెలుసా..? హైస్పీడ్
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
దేవర ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
ఇవాళ్టి నుంచి అగ్రనేతల తుది విడత ప్రచారం.. ఎవరెవరు.. ఎక్కడెక్కడ?
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
భర్తను గొలుసులతో కట్టేసి చిత్రహింసలు పెట్టిన భార్య.. కారణం ఇదేనట!
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
LSG vs KKR: హోరాహోరీ పోరుకు సిద్ధమైన కోల్‌కతా, లక్నో..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
ప్రభాస్ సినిమా కోసం 20 రోజులు వర్షంలో తడిచిన హీరోయిన్..
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు
పోస్టాఫీసులో మహిళల కోసమే ఈ ప్రత్యేక పథకాలు-కొన్నేళ్లలోనే ధనవంతులు