Prasadam To Doorsteps In Telangana: తెలంగాణ దేవాదాయ శాఖ సరికొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. ఇకపై ఇంట్లోనే ఉండి తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల నుంచి ప్రసాదాన్ని తెప్పించుకునే వెసులుబాటును కల్పించింది. ఇందులో భాగంగానే శనివారం తపాలా శాఖతో దేవాదాయ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.
ఇందులో భాగంగా తెలంగాణలో ముఖ్యమైన దేవాలయాలైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, బాసర శ్రీ జ్ఞాన సరస్వతి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, కొండగట్టు ఆంజనేయ స్వామి, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళీ, సికింద్రాబాద్ గణేశ్, కొమురవెల్లి మల్లికార్జున స్వామి, బల్కంపేట ఎల్లమ్మ–పోచమ్మ, కర్మన్‌ఘాట్ ఆంజనేయస్వామి ఆలయాల్లోని ప్రసాదాలను నేరుగా ఇంటికి తెప్పించుకోవచ్చు. ప్రస్తుతం ఈ 10 దేవస్థానాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ టెంపుల్స్ నుంచి ప్రసాదాలు కోరుకునే వారు స్థానికంగా ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటే రెండు మూడు రోజుల్లో ఆయా ఆలయాల నుంచి ప్రసాదం ఇంటికే చేరుతుంది. అయితే త్వరగా పాడై పోయే ప్రసాదాలు కాకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండే డ్రైఫ్రూట్స్, రవ్వ పొడి ప్రసాదాలను మాత్రమే పంపనున్నారు. ఇందులో భాగంగా శనివారం అరణ్య భవన్‌లోని కార్యాలయంలో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఈ ఒప్పందంలో దేవాదాయశాఖ కమిషనర్ అనిల్‌కుమార్, తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ ఎస్.రాజేంద్రకుమార్, దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కృష్ణవేణితో పాటు తదితరులు పాల్గొన్నారు.
Also Read: TTD News: మే 28న టీటీడీ ఆధ్వర్యంలో ఉచిత సామూహిక వివాహాలు.. దరఖాస్తుల ఆహ్వానం..
శివ ప్రసన్నం కోసం శునకాల్లా మారే భక్తులు.. ఇలా చేస్తేనే కోర్కెలు తీరుతాయట..! ఎక్కడో తెలుసా..?
రుక్మిణీ సమేత శ్రీకృష్ణావతారంలో దర్శనమిచ్చిన తిరుమలేశుడు.. చూడముచ్చటగా తిరుమల తెప్పోత్సవం