Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు నిరుద్యోగ సమస్య తొలిగిపోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. అలాంటి వారు రోజులో చేపట్టాల్సిన పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

Horoscope Today: ఈ రాశి వారికి ఈరోజు నిరుద్యోగ సమస్య తొలిగిపోతుంది.. ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
Horoscope Today
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 2:00 PM

Horoscope Today: మనలో చాలా మంది రాశి ఫలాలను విశ్వసిస్తుంటారు. ప్రతి రోజూ రాశి ఫలాలను ఆధారంగా చేసుకొని రోజును ప్రారంభిస్తుంటారు. అలాంటి వారు రోజులో చేపట్టాల్సిన పనుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏయే విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి లాంటి వివరాలు తెలుసుకొని రోజును ప్రారంభించడం ఉత్తమం. మరి ఆదివారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

మేష రాశి:

మేష రాశి వారికి ఈరోజు పరిచయాలు పెరుగుతుంటాయి. ఉన్న ఆస్తులను మరింతగా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. పేదవారికి కాయగూరలు దానం చేసుకోవడం మంచిది.

వృషభ రాశి:

ఈ రాశి వారు ఈరోజు చేపట్టబోయే పనుల్లో అనుకూలత కనిపిస్తోంది. ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. గణపతికి విశేషంగా ఎరుపు రంగులో ఉన్న పుష్పాలతో అర్చన నిర్వహించడం ఈ రాశివారికి సూచించదగ్గ అంశం.

మిథున రాశి:

మిథున రాశి వారు ఈరోజు కష్టమైన పనులు చేపడుతుంటారు. ఖర్చులు కూడా ఉంటాయి. అదే సమయంలో ఈ రాశివారు ప్రయోజనాలు కూడా సాధించుకుంటారు. మహాగణపతి అర్చన, లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

కర్కాటక రాశి:

ఈ రాశి వారు ఈరోజు బంధువులతో కొన్ని విషయాల గురించి తీవ్రంగా చర్చిస్తుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. వీరు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. నారాయణ నామ స్మరణ మేలు చేస్తుంది.

సింహ రాశి:

సింహ రాశి వారు ఈరోజు పలుకుబడి పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. అదే సమయంలో వేరు వేరు రూపాల్లో చేపట్టిన పనుల్లో నమ్మకాన్ని కోల్పోకుండా ప్రవర్తిస్తూ ఉండాలి. ఆంజనేయ స్వామి ఉపాసన మేలు చేస్తుంది.

కన్య రాశి:

ఈ రాశి వారు ఈరోజు వృత్తి, వ్యాపార విషయాల్లో కొంత యోగదాయకంగా ఉంటుంటాయి. అలాగే విలువైన వస్తువులు లేదా ఆభరణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అష్ట లక్ష్మీ స్తోత్ర పారాయణం ఈ రాశి వారికి మేలు చేస్తుంది.

తులా రాశి:

తులా రాశి వారికి షేర్లు, పెట్టుబడుల విషయంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఉపాసనం చేసుకోవడం ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.

వృశ్చిక రాశి:

ఈ రాశి వారు ఈరోజు చేపట్టిన పనులు కొంత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. శివాలయంలో అభిషేకం నిర్వహిస్తే మంచి జరుగుతుంది.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారికి ఈరోజు నిరుద్యోగ సమస్యలు తొలిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. పలు రకాల శుభ కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. కొన్ని శుభవార్తలను వింటారు. శ్రీరాముని నామ జపం మేలు చేస్తుంది.

మకర రాశి:

ఈ రాశి వారికి అనవసరమైన మాట పట్టింపులు చోటు చేసుకుంటుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించుకోవడం మంచిది. శివార్చణ ఈ రాశి వారికి సూచించదగ్గ అంశం.

కుంభ రాశి:

కుంభ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతుంటాయి. ధనము, వస్తు లాభాలు శుభ ఫలితాలను కలగజేస్తుంటాయి. ఐశ్వర్య లక్ష్మీ ఉపాసన మేలు చేస్తుంది.

మీన రాశి:

ఈ రాశి వారు చేపట్టిన పనులు కొన్ని వాయిదా పడుతుంటాయి. ఆర్థిక పరిస్థితులను తక్కువ చేసుకోకుండా జాగ్రత్తగా ఉంటూ.. లోటు పాట్లను సరిచేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. కనక దార స్తోత్ర పారాయణం మీన రాశి వారికి సూచించదగ్గ అంశం.

Also Read: Most Visited Places in India: మనదేశంలోని ఈ ప్రముఖ ప్రదేశాలను తక్కువ ఖర్చుతో చూడవచ్చు.. వివరాల్లోకి వెళ్తే..!

ఆమని వచ్చే వేళ రంగురంగులతో ముస్తాబవుతున్న అవని, హోలీ పండుగకు ఆహ్వానం పలుకుతున్న భారతావని

Vijayawada Durga Temple: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయం.. మునుపెన్నడూ లేని విధంగా ఇంద్రకీలాద్రి భూములును..