చిలగడ దుంపకు వివిధ ప్రాంతాల్లో భిన్నమైన పేర్లు ఉన్నాయి. దీన్ని ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే ఈ దుంప పోషకాహారంతో నిండి ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాలుగా దీనిని ఆహారంగా ఉపయోగిస్తున్నారు. బడ్జెట్‌లో సులభంగా లభించే ఈ దుంపను సూపర్‌ఫుడ్‌గా చెబుతారు.
శివరాత్రి ఉపవాసం పాటించే భక్తులు సాయంత్రం ఉపవాసం ముగించేటప్పుడు చిలగడ దుంపను తీసుకుంటారు. ఇది తిన్న వెంటనే కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం పాటు శక్తిని అందిస్తుంది. రాత్రి నిద్ర లేకుండా జాగరణం ఉండే కారణంగా శరీరానికి తగిన శక్తిని అందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ఇది శరీరానికి పలు పోషకాల్ని అందిస్తుంది. బీటా కెరొటిన్, విటమిన్ ఎ, సి, ఇ, బి-6, పొటాషియం, పీచు అధికంగా ఉంటుంది. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. చిలగడ దుంప ఆరోగ్య ప్రయోజనాలపై నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)