
హిందూ మతంలో స్వప్న శాస్త్రం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ గ్రంథం మన కలలు కేవలం మనస్సు ఊహలు కాదని.. కొన్నిసార్లు అవి దేవుడు లేదా విశ్వం పంపిన సంకేతాలు కూడా అని మనకు సూచిస్తుంది. ముఖ్యంగా వివాహానికి సంబంధించిన కొన్ని కలలు ఉన్నాయి. అటువంటి కలలు తరచుగా వస్తుంటే.. మీ జీవితంలో త్వరలో వివాహ ప్రతిపాదన లేదా సంబంధం రాబోతోందని సూచిస్తున్నాయి. ఈ శుభ సంకేతాన్ని సూచించే కలలు ఏమిటో తెలుసుకుందాం..
పువ్వులు కలలోకి వస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి తన కలలో అందమైన పువ్వులు, ముఖ్యంగా దండలు లేదా గులాబీలను చూసినట్లయితే.. అటువంటి కల చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ కల మీ జీవితంలో ప్రేమ, వివాహం ప్రారంభం కాబోతోందని సూచిస్తుంది. పెళ్లికాని వ్యక్తికి ఇటువంటి కల వస్తే త్వరలో వివాహ ప్రతిపాదన రాబోతోందని అర్థం చేసుకోవాలి.
పాపిటలో సింధూరం కనిపిస్తే
ఒక పురుషుడు లేదా స్త్రీకి కలలో పాటిట భాగంలో సిందూరం కనిపిస్తే లేదా నుదిటిపై సిందూరం పెట్టుకున్నట్లు కనిపిస్తే అటువంటి కల చాలా శుభప్రదమైన కలగా పరిగణించబడుతుంది. ఈ కల వివాహం సామీప్యతను, శుభ సంఘటన ప్రారంభాన్ని సూచిస్తుంది. ఈ కల అదృష్టం కలిగిస్తుందని.. వివాహం చేసుకునే అవకాశం దగ్గర పడిందని తెలియజేస్తుంది.
వధువు లేదా వరుడి గురించి కలలు వస్తే
ఎవరైనా కలలో వధువు వేషంలో ఉన్న స్త్రీని లేదా వరుడి వేషంలో ఉన్న పురుషుడిని చూస్తే.. అది వారికి త్వరలో వివాహ ప్రతిపాదన వస్తుందని సూచిస్తుంది. ఈ కల మీ జాతకంలో వివాహ సమయం ఆసన్నమైందని సూచిస్తుంది. పెళ్లి కోసం కుటుంబంలో చర్చలు ప్రారంభమవుతాయని అర్ధం.
సింధూరం, గాజులు, పట్టీలు, మెట్టెలు కలలో కనిపిస్తే
ఒక పురుషుడు లేదా స్త్రీ కలలో గాజులు, నుదుట సింధురం, మెట్టెలు వంటి సుమంగళి చిహ్నాలను చూసినట్లయితే.. వివాహానికి సంబంధించిన కొన్ని వార్తలు లేదా వివాహ సంబంధం త్వరలో మీ జీవితంలోకి ప్రవేశించబోతోందనడానికి సంకేతం. హిందూ సంస్కృతిలో ఈ విషయాలన్నీ వైవాహిక జీవితానికి సంకేతంగా పరిగణించబడతాయి.
ఆలయంలో జరుగుతున్న వివాహం కనిపిస్తే లేదా ఒక వివాహ మండపంలో మీకు మీరు కనిపిస్తే
ఒక వ్యక్తి కలలో తనకి తాను వివాహ మండపంలో కనిపించినా లేదా ఆలయంలో వేరొకరికి వివాహం జరుగుతున్నట్లు కనిపించినా అది చాలా శుభ సంకేతం. దేవుని దయతో మీకు వివాహం జరిగే అవకాశం ఏర్పడిందని , సరైన సమయంలో సంబంధం ఖరారు అవుతుందని ఇది చూపిస్తుంది.
స్వప్న శాస్త్రం జీవితంలోని కొన్ని మర్మమైన విషయాలను మాత్రమే కాదు భవిష్యత్ లో జరగనున్న విషయాల గురించి మనకు సూచనలను ఇస్తుంది. పైన పేర్కొన్నవి కలలలో ఏవైనా పదే పదే వస్తుంటే, వివాహ సమయం దగ్గరలో ఉందని.. అదృష్టం మీకు అనుకూలంగా ఉందని స్వప్న శాస్త్రం పేర్కొంది. అటువంటి సమయంలో మంచి ఆలోచనలను చేయండి. కుటుంబంతో చర్చించండి. దేవుడిని ధ్యానించండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.