Statue Of Equality: 8వ రోజుకు సమతామూర్తి సమారోహ పర్వం.. ఇవాళ ఆర్ఎస్ఎస్ చీఫ్, మధ్యప్రదేశ్ సీఎం హాజరు
శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని మైమరిసిపోతున్నారు.
Sri Rramanujacharya Millennium Celebrations: హైదరాబాద్(Hyderabad) శివారు శంషాబాద్ కు సమీపంలో ఉన్న ముచ్చింతల్(Muchintal)లో ఆధ్మాత్మిక శోభ విరాజిల్లుతోంది. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలివస్తున్న భక్తులు 216 అడుగుల భగవద్రామానుజ చార్యుల విగ్రహాన్ని దర్శించుకుని మైమరిసిపోతున్నారు. శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి(Sri Chinna Jeeyar Swamy) ఆధ్వర్యంలో ఈ మహాక్రతువు కొనసాగుతోంది. 5 వేల మంది రుత్విజులు యాగశాలలో హోమాలను నిర్వహిస్తున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు అత్యంత ఆధ్యాత్మికంగా మొదలయ్యాయి. ఉదయం ఆరున్నరకే అష్టాష్టరీ మంత్ర పఠనం జరగ్గా. ఏడున్నరకు పెరుమాళ్ ప్రాతఃకాల ఆరాధన జరిగింది. ఇక తొమ్మిది గంటల నుంచి శ్రీలక్ష్మీనారాయణ మహా యజ్ఞం మొదలైంది. ఆ తర్వాత ఉదయం పదింటికి ఐశ్వర్య ప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణేష్టి సంతాన ప్రాప్తికై వైనతేయ ఇష్టి. పదిన్నరకు యాగశాలలో విద్యార్ధుల విద్యాభివృద్ధి పెద్దల మనోవికాసానికీ హయగ్రీవపూజ.. ఇవాళ్టి సహస్రాబ్ది ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలు.
ఆ తర్వాత దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో 200 మంది సాధువులు ఇతర, పీఠాధిపతులు పాల్గొంటారు.మధ్యాహ్నం 12.30 కి పూర్ణాహుతి.. కార్యక్రమం జరుగుతుంది. మధ్యాహ్నం 2.30కి ప్రవచన మండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం. రాత్రి 9 గంటలకు పూర్ణాహుతి తో ఈ రోజు కార్యక్రమాలు పూర్తి కానున్నాయి.
114 యాగశాలల్లో 1035 హోమ గుండాల్లో పారాయణల మధ్య ఘనంగా హోమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే 108 దివ్య దేశాల్లో ఆలయాల్లో ప్రాణప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ఈ మహా క్రతువును చూసేందుకు పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నారు. రాజకీయ, సినీ, వివిధ రంగాలకు చెందిన వారు ఇక్కడకు విచ్చేస్తున్నారు. మంగళవారం కేంద్ర మంత్రి అమిత్ షా వచ్చారు. ఇవాళ ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహ దర్శనం చేసుకోనున్న ప్రముఖుల విషయానికి వస్తే మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆర్ఎస్ఎస్ కి చెందిన భయ్యాజీ జోషీ సందర్శించనున్నారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మధ్యాహ్నం 3.30 కి ముచ్చింతల్‌కు రానున్నారు. రాత్రి 8 గంటల వరకు వివిధ కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొంటారు. ప్రవచన మండపంలో జరిగే ధర్మాచార్య సభలో పాల్గొన్న అనంతరం ఆయన ప్రసంగించనున్నారు.
శ్రీరామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో 8వ రోజు కార్యక్రమాలు
– ఉదయం 6.30 గంటలకుఅష్టాక్షరీ మంత్ర పఠనం – ఉదయం 7.30 గంటలకు శ్రీ పెరుమాళ్ స్వామికి ప్రాతకాల ఆరాధన. – ఉదయం 9 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం – ఉదయం 10 గంటలకు ఐశ్వర్యప్రాప్తికై శ్రీలక్ష్మీనారాయణ ఇష్టి – ఉదయం 10 గంటలకు సంతానప్రాప్తికై వైనతేయ ఇష్టి – ఉదయం 10.30 గంటలకు యాగశాలలో చిన్నారుల విద్యాభివృద్ధికి, పెద్దల మానసిక వృద్ధికి హయగ్రీవ పూజ – ఉదయం 10.30 గంటలకు దేశంలోని ప్రముఖ సాధుసంతులచే రెండోరోజు ధర్మాచార్య సదస్సు. ఇందులో 200 మంది సాధు, సంతులు, పీఠాధిపతులు. పాల్గొననున్నారు. – మధ్యాహ్నం 12.30 గంటలకు పూర్ణాహుతి – మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రవచనమండపంలో ప్రముఖులచే ప్రవచనాలు, కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు – సాయంత్రం 5 గంటలకు శ్రీ లక్ష్మీ నారాయణ మహా యజ్ఞం – రాత్రి 9 గంటలకు పూర్ణాహుతిజ