AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medaram Jathara: గిరిజన జాతరకు సర్వం సిద్ధం.. నేడు మండమెలిగె కార్యక్రమం.. ఆదివాసీ సంప్రదాయంలో పూజలు

తెలంగాణ కుంభమేళా సమ్మక్క–సారలమ్మ(sammakka-saralamma) మహా జాతరలో నేడు మండమెలిగె(medaram) కార్యక్రమం జరగనుంది. జాతరకు వారం రోజుల ముందే ఈ వేడుక ప్రారంభమవుతుంది...

Medaram Jathara: గిరిజన జాతరకు సర్వం సిద్ధం.. నేడు మండమెలిగె కార్యక్రమం.. ఆదివాసీ సంప్రదాయంలో పూజలు
Mearam
Ganesh Mudavath
|

Updated on: Feb 09, 2022 | 9:20 AM

Share

తెలంగాణ కుంభమేళా సమ్మక్క–సారలమ్మ(sammakka-saralamma) మహా జాతరలో నేడు మండమెలిగె(medaram) కార్యక్రమం జరగనుంది. జాతరకు వారం రోజుల ముందే ఈ వేడుక ప్రారంభమవుతుంది. ఇది ప్రారంభం అయితే..మహాజాతర మొదలట్లేనని ఆదివాసీలు భావిస్తారు. ఈనెల 16 నుంచి నాలుగు రోజులపాటు జరిగే జాతరకు ప్రారంభ సూచికగా పూజారులు మండమెలిగె పండుగను నిర్వహిస్తారు. జాతరకు మూడు వారాల ముందు మొదటి బుధవారం గుడిమెలిగె పండుగ నిర్వహించడం ఆనవాయితీ. ప్రధాన పూజారి(వడ్డె) నేతృత్వంలోని బృందం బుధవారం మేడారంలోని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు. వన దేవతలకు వస్త్రాలు సమర్పిస్తారు. సారలమ్మ పూజారులు పూజలో పాల్గొంటారు. ముగ్గులు వేసి శక్తిపీఠాన్ని అలంకరిస్తారు. ఆదివాసీ సంప్రదాయ పూజలు రాత్రి సైతం జరుగుతాయి. గురువారం మేకపోతును బలి ఇచ్చి వన దేవతలకు నైవేధ్యం ఇస్తారు.

సారలమ్మ గుడి ఉండే కన్నెపల్లిలో, గోవిందరాజు గుడి ఉండే కొండాయిలో, పగిడిద్దరాజు గుడి ఉండే పూనుగొండ్లలోనూ ఇదే పూజా కార్యక్రమాలు జరుగుతాయి. గ్రామ దేవతలకు పూజలు చేసి, ఎలాంటి ఆటంకాలు కలగకుండా జాతర సజావుగా సాగేలా దీవించాలని మొక్కుతారు. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకురావడంతో జాతర జోరందుకుంటుంది. ఫిబ్రవరి 16న బుధవారం సాయంత్రం జంపన్నవాగు మీదుగా మేడారంలోని గద్దెల వద్దకు తీసుకు వస్తారు. అదేరోజు కొండాయి నుంచి గోవిందరాజు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు.

జాతరలో రెండో రోజు ముఖ్యమైనది. ఫిబ్రవరి 17న గురువారం సాయంత్రం సమ్మక్క గద్దె పైకి వస్తుంది. సాయంత్రం 6గం. సమయంలో చిలకలగుట్టపై కుంకుమ భరిణె రూపంలో ఉన్న సమ్మక్క రూపాన్ని చేతపట్టుకుని ప్రధాన పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. ములుగు జిల్లా కలెక్టర్, ఎస్పీలు తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపి దేవతకు ఆహ్వానం పలుకుతారు. సమ్మక్క రాకతో మేడారం భక్తిపారవశ్యంతో ఉప్పొంగుతుంది. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క–సారలమ్మలు శుక్రవారం భక్తజనానికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటారు. జాతరలో ఇదే రోజు ఎక్కువ మంది వస్తారు. నాలుగోరోజు సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి, గోవిందరాజును కొండాయికి, పగిడిద్దరాజును పూనుగొండ్లకు కాలినడకన తీసుకెళ్తారు. ఇలా దేవతలు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.

Also Read

Google Account: గూగుల్‌ అకౌంట్లో మీ వ్యక్తిగత వివరాలు కనిపించకుండా ఉండాలా..? ఇలా చేయండి

Kerala crime: సాయసయాత్రలో అపశ్రుతి.. కొండ చీలికల మధ్య చిక్కుకున్న యువకుడు.. కాపాడేందుకు విశ్వప్రయత్నాలు

Will: వీలునామా రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరా? అయితే ఎలా చేయించాలి?