Srisailam Devasthanam: భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు..

|

Jun 21, 2021 | 6:09 AM

Srisailam Temple Timings: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలను పొడిగించారు. సోమవారం

Srisailam Devasthanam: భక్తులకు గుడ్‌న్యూస్.. శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు..
Srisailam Devasthanam
Follow us on

Srisailam Temple Timings: ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాలోని శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ దేవాలయాల దర్శన వేళలను పొడిగించారు. సోమవారం నుంచి దర్శన వేళలు మారనున్నాయని శ్రీశైలం దేవస్థానం ఈవో కేఎస్ రామారావు ఆదివారం తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో.. సోమవారం నుంచి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించనున్నట్లు ఈవో వెల్ల‌డించారు. కర్ఫ్యూ సమయాల్లో మార్పులు చెయడంతో వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చే యాత్రికుల సౌలభ్యం కోసం ఆలయ దర్శన వేళల్లో మార్పులు చేసినట్టు వివరించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. అందరూ మాస్కులు ధరించాలని కోరారు.

ఇదిలాఉంటే.. స్వామి అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలతో పాటు సాయంత్రం ప్రదోషకాల నివేదనలు, మహామంగళ హారతులు, అమ్మవారికి ఆస్థానసేవ, లీలా కళ్యాణోత్సవం, ఏకాంత సేవలు యథావిధిగా జరుగుతాయ‌ని ఈవో రామారావు పేర్కొన్నారు. దైవక్షేత్ర దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నెగిటివ్ సర్టిఫికెట్‌తో రావాలని ఆయన సూచించారు.

Also Read:

TSRTC : తెలుగు రాష్ట్రాలు, కర్నాటక ప్రజలకు గుడ్ న్యూస్..! రేపట్నుంచి రెండు రాష్ట్రాలకు తెలంగాణ ఆర్టీసీ బస్ సర్వీసులు

Curfew in AP: సోమవారం నుంచి ఏపీలో కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్..