Ugadi 2022: ఉగాది మహోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం.. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 3 వరకు మహోత్సవాలు

|

Mar 30, 2022 | 8:53 AM

Srisailam Temple: ఉగాది మహోత్సవాలకు సిద్ధమైంది శ్రీశైల పుణ్యక్షేత్రం. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 3 వరకు ఉగాది మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు ఆలయాధికారులు.

Ugadi 2022: ఉగాది మహోత్సవాలకు సిద్ధమైన శ్రీశైలం.. ఇవాళ్టి నుంచి ఏప్రిల్‌ 3 వరకు మహోత్సవాలు
Srisailam Temple
Follow us on

ఉగాది వేడుకలకు(Ugadi 2022) శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామివారి ఆలయాన్ని(Srisailam temple ) ముస్తాబు చేశారు అధికారులు. ఆలయ గోపురాలతో పాటు అన్నివైపులా విద్యుత్ లైట్లతో అలంకరణ చేశారు. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో శ్రీశైలం దేవస్థానం ప్రత్యేకశోభను సంతరించుకుంది. కాసేపట్లో స్వామివారి యాగశాలలో ఈ మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా, తమ ఇంటి ఆడపడుచు అయిన శ్రీశైల భ్రమరాంబికాదేవికి చీర, సారె సమర్పించేందుకు, కన్నడ, మరాఠీ భక్తులు ఏటా భారీగా తరలి వస్తారు. ఇప్పటికే శ్రీశైలానికి లక్షలాది మంది భక్తులు వచ్చారు. వందల కిలోమీటర్ల దూరంలోని తమ ప్రాంతాల నుంచి, కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు భక్తులు. తమ ఇష్టదైవాలు మల్లికార్జునస్వామి, భ్రమరాంబిక దేవిని దర్శించుకుంటున్నారు.

ఉగాది నాటికి శ్రీశైలంలోని స్వామి, అమ్మవార్లను దాదాపు 5 లక్షల మంది దర్శించుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఆలయ అధికారులు. గతంలో ఎన్నడూ లేనివిధంగా, శ్రీశైలంలో ఏర్పాట్లపై ఆలయ ఈవో లవన్న ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయన ఆధ్వర్యంలో కర్ణాటక, మహారాష్ట్ర పరిధిలో మల్లన్నను కొలిచే ప్రాంతాలకు వెళ్లి, ఈ ఏటా శ్రీశైలంలో చేసిన ఏర్పాట్లపై ప్రత్యేకంగా వివరించారు.

ఆయా ప్రాంతాల భక్తమండలి కమిటీలతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి, శ్రీశైలంలో జరిగే ఉగాది వేడుకలకు రావాలని ఆహ్వానించారు. ఈవో లవన్న ఆహ్వానంతో మరింత ఎక్కువ మంది భక్తులు శ్రీశైలానికి తరలివస్తున్నారు. భక్తుల రాకకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. భక్తులకు అసౌకర్యం కలగకుండా, భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.

ఇవి కూడా చదవండి: Mamata Banerjee: ఈడీ, సీబీఐ, ఐటీ దాడులపై ఐక్యపోరాటం.. విపక్ష నేతలకు బెంగాల్‌ సీఎం మమత పిలుపు..

RGV: పునీత్‌ రాజ్‌కుమార్‌ సమాధిని సందర్శించిన వర్మ.. ఆయన లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానంటూ..