Sirimanu Utsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర ముహర్తం ఖరారు.. వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు

|

Aug 11, 2022 | 8:57 AM

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం. సెప్టెంబర్ 21న మొదలయ్యే అమ్మవారి జాతర నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది తరలివచ్చే జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Sirimanu Utsavam: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లి అమ్మవారి జాతర ముహర్తం ఖరారు.. వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు
Sirimanotsavam
Follow us on

Sirimanu Utsavam: ఉత్తరాంధ్ర వాసుల (North Andhra festival) ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర (Sri Pydithalli Ammavari) వేడుకలు ఏర్పట్లు జరుగుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రజల కొంగు బంగారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాల తేదీలను ప్రకటించారు దేవస్థానం అధికారులు. ఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. ఈ జాతర సుమారు నెల రోజుల పాటు జరుగుతుంది. ప్రధాన ఘట్టాలైన తోల్లేళ్లు ఉత్సవం అక్టోబర్ 10న, లక్షలాది మంది భక్తులు ఎదురుచూసే సిరిమాను సంబరం అక్టోబర్ 11 న జరపనున్నట్లు చెప్పారు దేవాదాయ శాఖ అధికారులు. ఉత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేశారు. కరోనా మహమ్మారి వల్ల రెండేళ్లుగా సిరిమాను సంబరం జరపలేకపోయారు. దీంతో ఈ సారి అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు ఆలయ ఈవో.

ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారు. విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం. సెప్టెంబర్ 21న మొదలయ్యే అమ్మవారి జాతర నవంబర్ 2 వరకు కొనసాగుతుంది. లక్షలాది మంది తరలివచ్చే జాతరకు దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..