AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhadrapada Purnima: కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు? భాద్రపద పూర్ణిమతో ఉన్న సంబంధం ఏమిటంటే

మహాభారత యుద్ధంలో అర్జునుడు తన సొంత బంధువులు, గురువు, స్నేహితులపై ఆయుధాన్ని ఎక్కు పెట్టడానికి నిరాకరించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు.. అర్జునుడు భగవద్గీతను బోధించాడు. ఈ సంభాషణ సమయంలో శ్రీ కృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించాడు. భగవద్గీతలో విశ్వరూప దర్శనం భాద్రపద పూర్ణిమతో ముడిపడి ఉందని మీకు తెలుసా?

Bhadrapada Purnima: కృష్ణుడు అర్జునుడికి విశ్వరూపాన్ని ఎందుకు చూపించాడు? భాద్రపద పూర్ణిమతో ఉన్న సంబంధం ఏమిటంటే
Vishwaroopa Darshan
Surya Kala
|

Updated on: Aug 12, 2025 | 1:55 PM

Share

మహాభారత యుద్ధం ప్రారంభానికి ముందు.. అర్జునుడు తన సొంత బంధువులు, గురువులకి వ్యతిరకంగా ఆయుధాన్ని చేపట్టడానికి సంకోచించాడు. అప్పుడు కురుక్షేత్రంలో శ్రీ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన ఉపదేశం, తరువాత కాలంలో శ్రీమద్ భగవద్గీతగా పిలువబడింది. ఈ సమయంలో కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రూపంలో మస్త విశ్వం, సమస్త సృష్టి కనబడుతుంది. కృష్ణుడి విశ్వరూప దర్శనం మనమందరం ఒకే బ్రహ్మలో భాగమని , మన ప్రతి చర్య ఉద్దేశ్యం ధర్మ స్థాపన కావాలని మనకు బోధిస్తుంది. భాద్రపద పూర్ణిమ రోజున ఈ విశ్వరూప దర్శనం లభించినట్లు నమ్మకం.

భగవద్గీతలో 11వ అధ్యాయంలో “విశ్వరూప దర్శన యోగము”లో అర్జునుడి సందేహాలను తొలగించడానికి, కృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపించాడు. ఈ రూపంలో అర్జునుడు సమస్త దేవతలు, రాక్షసులు, భూతాలు, భవిష్యత్తు, వర్తమాన కాలంలోని సమస్త విషయాలు కలిసి కనిపించాయని వర్ణించబడింది. ఆ అద్భుతమైన రూపాన్ని చూసి అర్జునుడు ఆశ్చర్యపోయాడు. భయపడ్డాడు. కాని అదే సమయంలో అతను కృష్ణుడి దివ్య శక్తిని, సర్వవ్యాపకత్వాన్ని అర్థం చేసుకున్నాడు.

భాద్రపద పూర్ణిమ సంబంధం చాలా మంది పండితులు గీతా ప్రబోధం, విశ్వరూప దర్శన సందర్భం భాద్రపద పూర్ణిమతో ముడిపడి ఉన్నాయని నమ్ముతారు. ఈ రోజున సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల ప్రత్యేక స్థానం ఆధ్యాత్మిక శక్తిని దాని శిఖరానికి తీసుకువస్తుంది, దీని కారణంగా సాధకుడు మానసిక ఆధ్యాత్మిక అనుభవాలను పొందవచ్చు. అందుకేభాద్రపద పూర్ణిమ గీతా మార్గం, ధ్యానానికి చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

ఇవి కూడా చదవండి

భద్రపద పౌర్ణమి, గీతాల అనుసంధానం భాద్రపద మాసంలోని పౌర్ణమి రోజున అనేక ప్రదేశాలలో గీత పారాయణం చేస్తారు. ఈ రోజున కృష్ణుడిని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. ఈ రోజును కృష్ణుడు అర్జునుడికి విశ్వ రూపాన్ని చూపించిన ప్రతీకాత్మక రోజుగా కూడా భావిస్తారు.

భాద్రపద పూర్ణిమ నాడు విష్ణువును ప్రత్యేకంగా పూజించడం వల్ల జ్ఞానం లభిస్తుందని.. గీత పారాయణం వలన జ్ఞానం, మానసిక ప్రశాంతత, జభగవంతునితో అనుబంధం లభిస్తాయని స్కంద పురాణం, పద్మ పురాణాలలో ప్రస్తావించబడింది.

ఈ రోజున గీతా పఠనం ప్రాముఖ్యత భాద్రపద పూర్ణిమ నాడు గీత పారాయణం చేయడం వల్ల జీవితంలో స్పష్టత, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, మానసిక బలం పెరుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం ఈ రోజున చంద్రుడు, సూర్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి అత్యంత అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది.

విశ్వరూపుని ఆధ్యాత్మిక సందేశం విశ్వరూప దర్శనం ప్రధాన సందేశం ఏమిటంటే దేవుడు సర్వవ్యాప్తి, విశ్వంలోని ప్రతి భాగం ఆయనతోనే రూపొందించబడింది.

జీవితం-మరణం, సుఖం-దుఃఖం, విజయం-ఓటమి, అన్నీ ఒకటే.. అదే బ్రహ్మ నాటకం.

మానవుడు ఫలితాల గురించి చింతించకుండా తన చర్యలపై దృష్టి పెట్టాలి.

భాద్రపద పూర్ణిమ నాడు ఏమి చేయాలంటే

ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించండి.

గీతలోని 11వ అధ్యాయాన్ని పారాయణం చేయండి.

శ్రీకృష్ణుడికి పసుపు పువ్వులు, తులసిని సమర్పించండి.

ధ్యానంలో ఆయన విశ్వరూపాన్ని స్మరించుకోండి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.