భగవంతుడు.. భక్తుల చెంతకు వెళ్లే దివ్యక్షేత్రం శ్రీకాళహస్తి. మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో శివయ్య పెళ్లికి వచ్చిన బంధుగణానికి, సమస్త భక్తగణానికి వీడ్కోలు పలికేందుకు నిర్వహించిన కైలాసగిరి ప్రదక్షిణోత్సవం ఆద్యంతం వైభవంగా సాగింది. 21 కిలోమీటర్ల పొడవునా వ్యాపించి ఉన్న కైలాసగిరి పర్వతశ్రేణుల చుట్టూ.. భక్తవత్సలుడైన భగవంతునితో పాటు వేలాది మంది భక్తులు నడుచుకుంటూ వెళ్లారు. విల్లంభులు ధరించిన పరమేష్ఠి ఆగమనంతో.. పల్లె ప్రాంతాలన్నీ పులకించిపోయాయి. నవ దంపతులకు అడుగడుగునా భక్తకోటి నీరాజనాలు పలుకుతూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. గిరిప్రదక్షిణ వెళ్లలేని భక్తులు ఎదురుగా శుకబ్రహ్మాశ్రమం వద్దకు వెళ్లి ఉత్సవమూర్తులకు స్వాగతం పలికారు. అనంతరం బంగారు అశ్వం, సింహవాహనాలపై పట్టణ వీధుల్లో ఊరేగుతూ ముక్కంటీశుడు భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
పరమేశ్వరుడికి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కోచోట శివలింగానికి ఒక్కో ప్రాముఖ్యత ఉంటుంది. వీటన్నింటిలో శ్రీకాళహస్తి దక్షిణ కైలాసంగా పిలవబడుతుంది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో స్వర్ణముఖి నదికి తూర్పు ఒడ్డున శ్రీకాళహస్తి క్షేత్రం ఉంది. భారతీయ వాస్తు కళ ఎంత గొప్పదో ఈ ఆలయం చూస్తే అర్థమవుతుంది. ఈ శివ లింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ప్రాణ వాయులింగంగా భక్తులచే పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ఉంటుందన్న విషయం తెలిసిందే.
Also Read:
బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసుల మైండ్ బ్లాంక్ అయ్యింది
Crime News: భార్య ఫోటో, ఫోన్ నంబర్ ఉన్న పోస్టర్లను ఈ ప్రబుద్దుడు ఊరంతా అంటించాడు.. ఎందుకంటే..?