లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ నెలను వ్రతాలమాసమని ఎందుకంటారంటే..

|

Aug 05, 2024 | 6:38 AM

శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగంలోనే పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధువు చేత మంగళ గౌరీ వ్రతమును ఆచరింపజేస్తారు. ఇలా ఆ వధువు ఐదు సంవత్సరాలు మంగళ గౌరీ వ్రతం చేయాలనే నియమం ఉంది.

లక్ష్మీ ప్రదమైన మాసం శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం.. ఈ నెలను వ్రతాలమాసమని ఎందుకంటారంటే..
Shravana Masam 2024
Follow us on

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణమాసం. పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు. అంతేకాదు స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన మాసం శ్రావణమాసం. కనుక ఈ నెలలో చేసే పూజలు అత్యంత విసిష్టమైనవి అని హిందువుల నమ్మకం. శివ కేశవులను అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శ్రావణ సోమవారం శని వారం ఇలా నెలలో ప్రతి రోజూ విశిష్టత గలవే.. ఈ నెలలో చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయని నమ్మకం. స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. ఈ నెలలో వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుందని అందుకనే ఈ శ్రావణ మాసం ఆధ్యాత్మిక మాసం అని అంటారు. అంతేకాదు శ్రావణమాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కనుక ఈ నెలను వ్రతాలమాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని శాస్త్రవచనం.

ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. గొప్ప పవిత్ర మాసం. అంతేకాకుండా ఈ నెలలో వ్రతాలు, విశిష్ట పండుగలు కూడా వస్తాయి. వాస్తవానికి ‘శ్రావణ’ మనే ఈ పేరులోనే వేదకాలమనే అర్ధం ఉంది. శ్రవణం అంటే “వినుట”అని అర్థం. వేదం గ్రంధమువలె పఠనం చేసేది కాదు. విని నేర్వదగినది. కనుక వేదాన్ని వినిపించే వారు గురువు. విని నేర్చుకొనే వారు శిష్యుడు. వేదాధ్యయనం చేసే వ్యక్తికీ మోహం తొలగి బ్రహ్మ స్వరూపం అర్ధమౌతుందని రామాయణం ఉవాచ. కనుక శ్రావణ మాసం వేదాధ్యయన సమయమని త్రేతాయుగంలోనే పేర్కొన్నారు. పురుషులతో పాటు స్త్రీలకూ వేదపఠనంతో సమానమైన లలితా సహస్ర నామాది స్తోత్ర పఠనాలు, నోములు, వ్రతాలు, మోహమును తొలగించి సౌభాగ్యము నిచ్చేవి. అందుచేతనే శ్రావణ మాసంలోని మంగళవారం రోజున కొత్తగా పెళ్ళైన వధువు చేత మంగళ గౌరీ వ్రతమును ఆచరింపజేస్తారు. ఇలా ఆ వధువు ఐదు సంవత్సరాలు మంగళ గౌరీ వ్రతం చేయాలనే నియమం ఉంది.

శ్రావణ పున్నమి కి ముందు శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారు. శ్రావణ పున్నమిని జంధ్యాల పున్నమి అని రాఖీ పున్నమి అని అంటారు. ఈ రోజున బ్రహ్మచారులు గాని గృహస్థులు గాని శ్రౌత స్మార్త నిత్య కర్మానుష్టాన సిద్ధికి నూతన యజ్ఞోపవీత ( జంధ్యం ) తప్పని సరిగా కొత్తది ధారణ చేస్తారు. అంతేకాదు ఆడపిల్లలందరూ తమ సోదరులకు రాఖీలు కడతారు. యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః అంటే ఎక్కడ స్త్రీలు పూజింప బడతరో,అక్కడ దేవతలు నివసిస్తారు.. అదే విధంగా ఏ ఇంట్లో గృహిణులు ఆనందంగా ఉంటారో ఆ ఇంటిలోని సభ్యులందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు అని నమ్మకం.

ఇవి కూడా చదవండి

ఈ శ్రావణ మాసంలోనే బహుళ అష్టమి తిది రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. కనుక శ్రీ శ్రీకృష్ణమిని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఇక శ్రావణ మాసంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కనుక రైతులు వ్యవసాయం చేయడానికి కావలసిన వర్షాలు విస్తారంగా కురుస్తాయి. పాడి పంటలను సంవృద్దిగా ఉండాలని కోరుకుంటారు. ఈ విధంగా అందరికి ఆనందాన్ని ఇచ్చే మాసం శ్రావణ మాసం నేటి నుంచి ప్రారంభం అయింది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు