Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి కొనసాగుతున్న డిమాండ్.. 2 లక్షల ప్రత్యేక దర్శనం టికెట్స్ నిమిషాల్లోనే ఖాళీ..

|

Dec 24, 2022 | 10:45 AM

ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 2వ తేదీన వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tirumala: వైకుంఠ ద్వార దర్శనానికి కొనసాగుతున్న డిమాండ్.. 2 లక్షల ప్రత్యేక దర్శనం టికెట్స్ నిమిషాల్లోనే ఖాళీ..
Tirumala Srivari Temple
Follow us on

ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశికి విశిష్ట స్థానం ఉంది. శ్రీ మహా విష్ణువు ఈ రోజున మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వస్తాడని భావిస్తారు. అందుకనే ఈ ఏకాదశిని ‘ముక్కోటి ఏకాదశి’గా కూడా జరుపుకుంటారు. అత్యంత ఘనంగా జరుపుకుంటారు. తెలుగు వారు వైకుంఠ ఏకాదశి రోజున వైష్ణవ క్షేత్రాల్లో దర్శనం కోసం బారులు తీరుతారు. తిరుమల క్షేత్రంలో కొలువైన శ్రీవారిని వైకుంఠ ఏకాదశి రోజున దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి జనవరి 2వ తేదీన వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

శ్రీవారి దర్శనం కోసం రూ. 300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల ఆన్ లైన్ కోటాను శనివారం ఉదయం 9గంటలకు టీటీడీ విడుదల చేసింది. ఆన్ లైన్ లో 10 రోజులుకు 2 లక్షల రూ.300 దర్శనం టికెట్లు విడుదల చేసింది.. వైకుంఠ ద్వార దర్శనానికి  డిమాండ్ కొనసాగుతూ.. ఈ టికెట్స్ మొత్తం ఇలా రిలీజ్ చేయగానే హాట్ కేకుల్లా వెంటనే బుక్ అయ్యాయి. కేవలం 45 నిమిషాల్లో ఖాళీ దర్శన టికెట్స్ ఖాళీ అయ్యాయి.

మరోవైపు సర్వ దర్శనం భక్తులుకు జనవరి 1వ తేదిన ఆఫ్ లైన్ విధానంలో టోకెన్లు కేటాయించనున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాలు ద్వారా రోజుకి 50 వేల చొప్పున 5 లక్షల టోకెన్లు జారీ చేయనున్నది టీటీడీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..