Srisailam Temple: మల్లన్న భక్తులకు అలర్ట్.. శ్రీశైలంలో స్పర్శ దర్శనాల నిలిపివేత.. ఎప్పటినుంచంటే?
2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ముక్కోటి ఏకాదశి సందర్భంగా శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. ఓ వైపు స్పర్శ దర్శనాలు, మరో వైపు భక్తుల దర్శనాలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఈ క్రమంలో దేవస్థానం మల్లికార్జున స్వామి గర్భగుడిలో స్పర్శ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు దేవస్థానం ఈవో లవన్న ప్రకటించారు. ఈమేరకు శ్రీశైలంలో ఈనెల 31 నుంచి జనవరి 2 వరకు శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలు నిలిపేసినట్లు తెలిపారు.
జనవరి 1 నూతన సంవత్సరం, జనవరి 2న ముక్కోటి ఏకాదశితో భక్తులు అధిక సంఖ్యలో క్షేత్రనికి వచ్చే అవకాశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
31 నుంచి మూడు రోజులపాటు శ్రీస్వామివారి గర్భాలయా అభిషేకాలు,వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలుపుదల చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
2వ తేదీ ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులకు శ్రీస్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనాలు కల్పించనున్నారు. ఈ మేరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జనవరి 2 న ముక్కోటి ఏకాదశి రోజు శ్రీస్వామి అమ్మవారికి రావణవాహనసేవ, గ్రామోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు, అందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..