Horoscope Today: ఈ రాశివారు ఉద్యోగపరంగా శుభవార్త వింటారు.. గురువారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..
ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు.
-
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)
కొత్త ఆదాయ మార్గానికి సంబంధించి ఎంతో దూరాలోచనతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో కొంచెం శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ అవి సత్ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం చాలా వరకు నిలకడగా ఉంటుంది. ఆదాయం పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఐటీ తదితర వృత్తి నిపుణులు అభివృద్ధి సాధిస్తారు. ప్రేమ వ్యవహారం పెళ్ళికి దారి తీస్తుంది. విద్యార్థులు సునాయాసంగా విజయం సాధిస్తారు.
-
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)
ఆదాయపరంగా ఒక శుభవార్త వింటారు. ఆస్తికి సంబంధించిన కోర్టు కేసులో నెగ్గే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆరోగ్యం పర్వాలేదు. అయితే, కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కొందరు మిత్రుల సహాయంతో వ్యక్తిగతంగా ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఒక కుటుంబ సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరుకుతుంది.
-
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)
ఉద్యోగ పరంగా బాగా ఒత్తిడి పెరిగి ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ అనవసర ఖర్చులు పెరిగిపోతాయి. పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. కొందరు బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. విద్యార్థులకు బాగానే ఉంటుంది.
-
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. మరో ఆదాయ మార్గం కూడా మీ ముందుకు వస్తుంది. ఉద్యోగంలో మీకు అంతా అనుకూలంగానే ఉంటుంది. అధికారులు బాగా సహకరిస్తారు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఏ నిర్ణయం తీసుకున్నా కుటుంబ సభ్యులతో సంప్రదించి తీసుకోవడం మంచిది. వృత్తి వ్యాపారాలు వారు ఆర్థికంగా లబ్ధి పొందుతారు.
-
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఒక ఆర్థిక సమస్య కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. స్నేహితులతో వాదనలకు దిగవద్దు. బంధువుల కారణంగా కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆదాయం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ప్రేమ వ్యవహారాలలో ముందుకు వెళతారు.
-
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)
కొద్దిగా అదృష్ట యోగం పడుతుంది. ఆకస్మిక ధన లాభానికి, ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల విషయంలో కాస్తంత అసంతృప్తి కలుగుతుంది. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో దూసుకుపోతారు. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది.
-
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)
వృత్తి ఉద్యోగాల వారు బాగా శ్రమ పడాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సాఫీగా ఉద్యోగ జీవితం సాగిస్తారు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. దూర ప్రాంతంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. పిల్లల్లో ఒకరికి విదేశాల నుంచి ఆఫర్ వస్తుంది. కొద్దిపాటి అనారోగ్యానికి అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.
-
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ఠ)
పిల్లలు శుభవార్త తీసుకువస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. అవసరానికి తగ్గట్టుగా ఆర్థిక సహాయం అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా రాణిస్తారు. కుటుంబ జీవితంలో టెన్షన్స్ ఉంటాయి. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
-
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)
ఆర్థికంగా బలం పుంజుకోవడానికి సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల వారు కొద్దిగా శ్రద్ధ పెంచాల్సి ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఆర్థిక సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. బంధుమిత్రుల అండదండలు ఉంటాయి. తోబుట్టువులకు సహాయం చేస్తారు. అనుకోకుండా ఒక మంచి శుభవార్త వింటారు.
-
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2)
ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. పిల్లల్లో ఒకరు దూర ప్రాంతంలో ఉద్యోగం సంపాదిస్తారు. పెళ్లి ప్రయత్నాలలో చికాకులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటికి అవసరమైన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంతవరకు మెరుగుపడుతుంది.
-
కుంభం (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)
ఏలినాటి శని కారణంగా పనులన్నీ పెండింగ్ లో పడుతుంటాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తిప్పట, శ్రమ ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. స్నేహితులకు ఆర్థికంగా సహాయం చేయాల్సి వస్తుంది. బంధువులతో అపార్ధాలు ఏర్పడతాయి. తల్లిదండ్రులలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. ఆచి తూచి మాట్లాడండి.
-
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)
వృత్తి ఉద్యోగాలపరంగా ఆదాయం బాగానే పెరుగుతుంది. మనసులోని కోరిక ఒకటి నెరవేరుతుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అనారోగ్యం నుంచి ఉపశమనం పొందుతారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రేమ వ్యవహారం ఫలిస్తుంది.