Solar Eclipse: రేపే ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి

|

Oct 01, 2024 | 5:42 PM

సూర్య గ్రహణ సమయం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గ్రహణం సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని లేకుంటే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ, 2024న సంభవించనుండి. అయితే తొలి సూర్య గ్రహణంలా ఈ సూర్య గ్రహణం కూడా భారత్‌లో కనిపించదు

Solar Eclipse: రేపే ఈ ఏడాదిలో చివరి సూర్యగ్రహణం.. పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు.. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండి
Solar Eclipse
Image Credit source: pexels
Follow us on

సూర్య గ్రహణం అనేది ఒక ఖగోళ దృగ్విషయం. భూమి.. సూర్యుని మధ్య చంద్రుడు వచ్చి సూర్యుడిని పూర్తిగా లేదా పాక్షికంగా భూమి మీద పడకుండా కవర్ చేస్తాడు. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రహణ సమయంలో గ్రహాల స్థితిలో మార్పు ఉంటుంది. ఈ గ్రహణ సమయం మానవ జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. గ్రహణం సమయంలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదని లేకుంటే జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నమ్ముతారు. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ, 2024న సంభవించనుండి. అయితే తొలి సూర్య గ్రహణంలా ఈ సూర్య గ్రహణం కూడా భారత్‌లో కనిపించదు.

సూర్య గ్రహణ సమయం

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం సర్వ పితృ అమావాస్య రోజున అంటే 2 అక్టోబర్ 2024న సంభవించనుంది. ఈ సూర్యగ్రహణం అక్టోబర్ 2వ తేదీ రాత్రి 09.13 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 03.17 గంటల వరకు ఉంటుంది. అయితే ఈ సూర్య గ్రహణం భారతదేశంలో కనిపించదు.

భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుంది?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్‌లో కూడా దీని ప్రభావం తక్కువగానే ఉండబోతోంది. దీని కారణంగా సూర్య గ్రహణ సూత కాలం కూడా పరిగణించబడదు.

ఇవి కూడా చదవండి

సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుందంటే?

సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అయితే బ్రెజిల్, కుక్ దీవులు, చిలీ, పెరూ, అర్జెంటీనా, మెక్సికో, హోనోలులు, ఫిజి, ఉరుగ్వే, అంటార్కిటికా, న్యూజిలాండ్, ఆర్కిటిక్, బ్యూనస్ ఎయిర్స్ వంటి ఇతర దేశాలలో, బెకా ద్వీపం మొదలైన ప్రాంతాల్లో రెండవ సూర్యగ్రహణం కనిపిస్తుంది.

సంపూర్ణ సూర్యగ్రహణం వ్యవధి ఎంత అంటే?

భారత కాలమానం ప్రకారం ఈ సంవత్సరంలో చివరి సూర్యగ్రహణం రాత్రి 9.14 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.17 గంటలకు ముగుస్తుంది. దీని మొత్తం వ్యవధి సుమారు 6 గంటల 3 నిమిషాలు ఉంటుంది.

సూర్యగ్రహణం సమయంలో ఈ ప్రత్యేక విషయాలను జాగ్రత్తగా చూసుకోండి

ఆహారం, పానీయం

సూర్య గ్రహణ సమయంలో తినడం, త్రాగడం నిషేధించబడింది. గ్రహణం సమయంలో వెలువడే హానికరమైన కిరణాలు ఆహారాన్ని కలుషితం చేస్తాయని నమ్ముతారు.

నిద్రిపోవడం

సూర్య గ్రహణ సమయంలో నిద్రపోవడం కూడా నిషిద్ధం. నిద్రిస్తున్న వ్యక్తిపై గ్రహణం అననుకూల ప్రభావాన్ని చూపిస్తుందని నమ్మకం. కనుక గ్రహణ సమయంలో నిద్రపోవడం నిషేధం.

పూజ చేయడం

గ్రహణ సమయంలో పూజ చేయడం నిషిద్ధమని భావిస్తారు. అందుకే ఈ కాలంలో ఆలయ తలుపులన్నీ మూసి ఉంటాయి.

ప్రయాణం

గ్రహణం సమయంలో ప్రయాణం కూడా నిషేధించబడింది. గ్రహణ సమయంలో ప్రయాణించడం వల్ల ప్రమాదాల ప్రమాదం పెరుగుతుందని నమ్ముతారు.

కొత్త పనిని ప్రారంభించ వద్దు

గ్రహణ సమయంలో ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉండాలి. గ్రహణం సమయంలో ఏ పని ప్రారంభించినా అసంపూర్తిగా మిగిలిపోతుందని నమ్ముతారు.

లోహపు పాత్రల ఉపయోగం

గ్రహణ సమయంలో లోహపు పాత్రలు వాడకూడదు. గ్రహణం సమయంలో లోహ పాత్రలలో విషపూరిత మూలకాలు కలిసిపోతాయని నమ్ముతారు.

గర్భిణీ స్త్రీలు

గ్రహణ సమయంలో గర్భిణులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. గ్రహణాన్ని వీక్షించకుండా ఇంట్లోనే ఉండాలి. ఈ కాలంలో పదునైన వస్తువులకు దూరంగా ఉండాలి.

సూర్యగ్రహణం సమయంలో చేయాల్సిన పనులు ఏమిటంటే

ధ్యానం- సాధన

సూర్యగ్రహణం సమయంలో ధ్యానం, ప్రార్థన కోసం పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో చేసే ధ్యానం మానసిక ప్రశాంతతను, సానుకూల శక్తిని అందిస్తుందని నమ్ముతారు.

మంత్రం పఠించండి

గ్రహణం సమయంలో పూజలు చేయరు. అయితే ఈ సమయంలో మనసులో మంత్రాలు పఠించడం లేదా మతపరమైన గ్రంథాలను పఠించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. గ్రహణ సమయంలో మంత్రాలను పఠించడం ముఖ్యంగా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. మంత్రాలను పఠించడం గ్రహణం అశుభ ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

దాతృత్వం- ధర్మం

గ్రహణ సమయంలో దానం చేయడం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఆహారం, బట్టలు, డబ్బు లేదా ఇతర వస్తువులను దానం చేయడం ద్వారా గ్రహణం ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చని నమ్ముతారు.

స్నానం ప్రాముఖ్యత

గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర నది స్నానం చేయడం కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. నదిలో స్నానం చేయడం కుదరని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు.

తాగడం, తినడం నిషేధం

సూర్యగ్రహణం సమయంలో తినడం లేదా త్రాగడం నిషేధించబడింది. అందుకే గ్రహణం సమయంలో ఉపవాసం ఉండి, గ్రహణం ముగిసిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోండి. ఇది మానసిక, శారీరక శుద్దీకరణను అందిస్తుంది.

తులసి దళాలు

సూర్య గ్రహణానికి ముందు అన్ని ఆహార పదార్ధాలు, వండిన ఆహారంలో తులసి దళాలను జోడించండి. ఇలా చేయడం వల్ల గ్రహణం సమయంలో కూడా ఆహారం స్వచ్ఛంగా ఉంటుందని నమ్ముతారు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి