హిందూ మతంలో స్కంద షష్టి పండుగకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం ద్వారా ప్రజల కోరికలన్నీ నెరవేరుతాయి. జీవితంలో ఏర్పడే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఇంట్లో సుఖసంతోషాలు, శ్రేయస్సు నెలకొంటాయి. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయి. స్కంద షష్ఠి రోజున కార్తికేయుడిని ఎలా పూజించాలో తెలుసుకుందాం.
పంచాంగం ప్రకారం మార్గశిర మాసంలోని శుక్ల పక్ష షష్ఠి తిథి జనవరి 04న రాత్రి 10 గంటలకు ప్రారంభమై మర్నాడు అంటే జనవరి 05 రాత్రి 08:15 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం స్కంద షష్ఠి జనవరి 05వ తేదీ 2025 న జరుపుకుంటారు. భక్తులు కార్తికేయుడిని పూజించే స్కంద షష్ఠి కొత్త సంవత్సరంలో ఇదే మొదటి స్కంద షష్టి.
స్కంద షష్ఠి అనేది హిందూ మతం ముఖ్యమైన పండుగ. ఈ రోజు కార్తికేయకు అంకితం చేయబడింది. ఈ పండుగను సాధారణంగా కార్తీక మాసంలోని శుక్ల పక్షం షష్టి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున కార్తికేయుడిని పూజించిన భక్తులకు ధైర్యం, తెలివి, విజయం సొంతం అవుతుంది. ఈ రోజున కార్తికేయుడిని పూజించడం వల్ల దుష్టశక్తులు నశిస్తాయని నమ్మకం ఉంది. కార్తికేయుని అనుగ్రహం వల్ల జీవితంలో సుఖసంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. సంతానం కోసం ఈ రోజున ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యస్వామిని పూజించడం వలన అనుగ్రహం కోరిక తీరుతుందని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : పైన తెలిపిన విషయాలు పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.