ఉత్తరాంధ్ర వాసుల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ప్రధాన ఘట్టం సిరిమాను వేడుకల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. దసరా నుండి మొదలయ్యే వేడుకల్లో.. ఇవాళ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఘనంగా జరుగుతుంది. ఏటా వైభవంగా జరిగే ఉత్సవాలను ఈ ఏడాది కూడా సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఐతే కరోనా కారణంగా అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించడం లేదు. ఐతే అధికారుల సూచనలను పక్కనబెట్టిన భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో 2,500మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు అధికారులు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్యదేవత శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను పండుగ ఇవాళ ప్రారంభంకానుంది. నెల రోజుల పాటు జరిగే జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను పండుగకు అధికారులు సర్వం సిద్ధం చేశారు.
సిరిమాను జాతరలో ప్రధాన ఘట్టాలైన తోలేళ్లు, సిరిమాను ఉత్సవాల సందర్భంగా లక్షలాదిగా తరలివస్తున్న భక్తులకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. తోలేళ్ల ఉత్సవం ప్రారంభంకాగా.. మంగళవారం జరిగే సిరిమాను సంబరం అంబరాన్నంటనుంది. పైడితల్లి అమ్మవారి ఉత్సవాలను కళ్లారా చూసేందుకు భక్తులు లక్షలాదిగా తరలివస్తున్నారు. దీంతో విజయనగరం పట్టణం భక్తజన సంద్రంగా మారింది.
పైడితల్లి ఉత్సవాల్లో తొలి ఘట్టం తోలేళ్ల ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సిరిమాను వేడుకల్లో పాల్గొనేందుకు ఏపీతో పాటు… పక్కరాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. నవంబరు 3న వనంగుడిలో జరిగే చండీహోమంతో ఇవి ముగుస్తాయి. 18న తొలేళ్ల ఉత్సవం, 26న పెద్ద చెరువులో తెప్పోత్సవం, 31న కలశజ్యోతి ఊరేగింపు ఉంటుంది. నవంబరు 2న చదురుగుడి ప్రాంగణంలో ఉయ్యాల కంబాల, 3న చండీహోమం, పూర్ణాహుతి, దీక్షా విరమణ కార్యక్రమాలు రైల్వేస్టేషన్ వద్ద ఉన్న వనంగుడిలో జరుగుతాయి.
ఇవి కూడా చదవండి: Beverages: వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్, బ్రాందీ, రమ్.. వీటిలో తేడా ఏంటో తెలుసా..
Mahindra: బొలెరో, స్కార్పియో, జైలో మహీంద్రా ప్రతి వాహనం పేరు చివరలో ఓ ఎందుకు వస్తుందో తెలుసా..