జీవితంలో అనేక బాధలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..

|

Nov 22, 2021 | 10:51 PM

Best Astro Remedies: ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందం, సంపద గురించి కలలు కంటారు కానీ ఆ కోరికలు సమయానికి నెరవేరవు. చాలా కష్టపడి పనిచేసినా అదృష్టం

జీవితంలో అనేక బాధలతో ఇబ్బందిపడుతున్నారా..! అయితే ఈ 5 విషయాలు తెలుసుకోండి..
Puja
Follow us on

Best Astro Remedies: ప్రతి ఒక్కరూ జీవితంలో ఆనందం, సంపద గురించి కలలు కంటారు కానీ ఆ కోరికలు సమయానికి నెరవేరవు. చాలా కష్టపడి పనిచేసినా అదృష్టం లేక ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతారు. విజయానికి చేరువైన తర్వాత కూడా మీరు దానిని సాధించలేకపోతారు. అలాంటి సమయంలో మీరు ఎవరికీ తెలియజేయకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెమిడీస్‌ని పాటించండి.. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. ఒక నిర్దిష్ట పనిలో విజయం కోసం
ఒక నిర్దిష్ట పనిలో విజయం సాధించడానికి శనివారం సాయంత్రం తమలపాకు, ఒక రాగి నాణెం తీసుకుని గబ్బిలాలు నివసించే చెట్టు దగ్గర పెట్టండి. మరుసటి రోజు అంటే ఆదివారం సూర్యోదయానికి ముందు ఆ చెట్టు దక్షిణం వైపున ఉన్న కొమ్మపై చిటికెడు ఇంగువను చల్లండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీరు మీ నిర్దిష్ట పనిలో విజయం సాధిస్తారు.

2. అప్పుల నుంచి బయటపడే మార్గాలు
ఆశ్లేష నక్షత్రం వచ్చే సోమవారం బహేరా చెట్టు వేరుని ఇంటికి తీసుకొచ్చి ఆచారాల ప్రకారం గంగాజలం పోసి పవిత్రం చేసి మీ పూజగదిలో ప్రతిష్టించండి. ఈ పరిహారాన్ని పూర్తి భక్తితో చేస్తే త్వరలో వ్యక్తి రుణ విముక్తుడవుతాడని నమ్ముతారు.

3. సంక్షోభాన్ని అధిగమించడానికి
మీరు జీవితంలో ఆకస్మిక సంక్షోభాల వల్ల ఇబ్బంది పడుతున్నట్లయితే వాటని నివారించడానికి ఇంట్లోకి ఒక మర్రి చెట్టు ఆకుని తీసుకురండి. ఈ రెమెడీ చేయడం వల్ల మీకు ఎలాంటి సమస్యా ఉండదు.

4. డబ్బు సంపాదించడానికి
తెల్లటి నూలు వస్త్రాలు ధరించి, తెల్లటి పీఠంపై ఉత్తరాభిముఖంగా కూర్చుని, ఎర్రని పగడపు మాలతో లక్ష్మీ దేవి మంత్రాన్ని జపించండి. ఈ పరిహారం చేయడం ద్వారా మీకు జీవితంలో డబ్బుకు కొరత ఉండదు.

5. నర దిష్టి..
చాలామంది నరదిష్టి తగులుందని ఫిర్యాదు చేస్తారు. మీకు ఇలాంటివి ఏదైనా జరిగితే చింతచెట్టు మూడు చిన్న కొమ్మలను తీసుకొని దానిని వ్యక్తి నుదిటిపై ఇరవై ఒక్క సార్లు తిప్పి మంటలో వేయండి. ఇలా చేయడం వల్ల నరదిష్టి తొలగిపోతుంది.

గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని రాయడం జరిగింది.

33 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.. 2022 ఐపీఎల్‌లో కోట్లు పలకబోతున్నాడు.. ఆ ఆటగాడు ఎవరో తెలుసా..?

IBPS SO Recruitment 2021: నిరుద్యోగులకు గమనిక.. 1828 బ్యాంకు పోస్ట్‌లకు రేపే చివరితేదీ..

Weight Loss: 60 ఏళ్లు దాటినవారు బరువు తగ్గాలంటే ఈ వ్యాయామాలు చక్కటి పరిష్కారం..