Shravana Masam 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలోని ఐదవ నెల. ఈ మాసాన్ని పురాణ గ్రంథాలలో చాలా పవిత్రమైనదిగా పేర్కొన్నారు. ఈ మాసంలో ఆది దంపతులైన శివ పార్వతులను పూజిస్తారు. ఈ మాసంలో శివుడిని పూజిస్తే సులభంగా ప్రసన్నమవుతాడని నమ్మకం. ఎవరికైతే ఆ మహాదేవుని ఆశీర్వాదం లభిస్తే.. ఆ వ్యక్తి జీవితంలో దేనికీ లోటు ఉండదని నమ్మకం. మీరు కూడా శివునికి శ్రావణ మాసంలో పూజలు చేసి ఆయన అనుగ్రహానికి పాత్రులు కావాలంటే.. ఈ మాసంలో కొన్ని పొరపాట్లు చేయకండి. అవి ఏమిటో ఈరోజు తెలుసుకుందాం..
శ్రావణ మాసంలో ఈ తప్పులు చేయకండి
శ్రావణ మాసంలో పరమశివుని ఆరాధించే సమయంలో.. ఎప్పుడూ కుంకుమని సమర్పించకూడదు. శివుడికి అభిషేకం అనంతరం విభూతితో అలంకారం చేసిన తర్వాత చందనంతో తిలకం తీర్చిదిద్దాలి. ఎట్టి పరిస్థితుల్లో కుంకుమని మాత్రం పెట్టవద్దు.
తులసిని శివునికి ఎప్పుడూ సమర్పించకూడదు. శివుడికి పంచామృతాన్ని సమర్పిస్తున్న సమయంలో కూడా పంచామృతంలో తులసిని ఉపయోగించవద్దు. మహాదేవునికి తులసిని నైవేద్యంగా సమర్పించే వ్యక్తికి పూజ ఫలం లభించదని శివుడు తులసిని శపించాడు. కొబ్బరికాయ, నువ్వులు, పసుపు , మొగలి పుష్పం కూడా శివుడికి పూజ సమయంలో సమర్పించబడవు.
శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం కూడా నిషిద్ధం. అశుభమైనదిగా పరిగణించబడుతుంది. అదే సమయంలో, ఈ మాసంలో పొరపాటున కూడా మొక్కలకు హాని చేయకూడదు. శివుని అనుగ్రహం కావాలంటే ఈ మాసంలో మరిన్ని చెట్లను నాటండి.. వాటిని సేవించండి.
ఈ మాసంలో మద్యం, మాంస పదార్ధాలు తినకూడదు. అంతే కాకుండా తామసిక ఆహారానికి కూడా దూరంగా ఉండాలి.
శ్రావణ మాసంలో పెరుగు, మజ్జిగ, పచ్చి ఆకుకూరలు, బెండకాయలు, ముల్లంగి, ఉల్లి, వెల్లుల్లి మొదలైన వాటికి దూరంగా ఉండాలి. ఈ పదార్ధాలను తినడం వలన మనస్సు చెదిరిపోతుంది.. పూజలో ఏకాగ్రత లోపిస్తుందని పురాణాల్లో పేర్కొన్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..