Raksha Bandhan: రక్షా బంధన్ రోజున ఈ సమయంలో రాఖీ కట్టొద్దు.. అది మీ సోదరులకు నష్టం చేస్తుంది..!
Raksha Bandhan 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి రక్షా బంధన్ పండుగ ఆగస్టు 11, 2022 గురువారం నాడు ఉంది. ఈ రక్షాబంధన్ రోజున..
Raksha Bandhan 2022: హిందూ క్యాలెండర్ ప్రకారం ఈసారి రక్షా బంధన్ పండుగ ఆగస్టు 11, 2022 గురువారం నాడు ఉంది. ఈ రక్షాబంధన్ రోజున అక్కాచెల్లెల్లు తమ సోదరులకు రాఖీ కట్టి.. వారు దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని ఆశ్వీరిస్తారు. అయితే, ఈ రక్షా బంధన్‌ను శుభముహూర్తంలో కడితేనే వారి సోదరుడికి మంచి జరుగుతుంది. లేదంటే.. చాలా సమస్యలు వారు ఫేస్ చేయాల్సి వస్తుంది. శుభముహూర్తంలోనే రాఖీని కట్టాలి. భద్రకాలంలో రాఖీని కట్టకూడదు. ఈ సమయాన్ని అశుభంగా పేర్కొంటారు. రక్షాబంధన్ కట్టడానికి శుభ సమయం ఏంటి? భద్ర కాలంలో రాఖీ ఎందుకు కట్టకూడదు? ఆసక్తికర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
రక్షాబంధన్ 2022 శుభ సమయం.. రక్షాబంధన్ తేదీ – 11 ఆగస్టు 2022, గురువారం పూర్ణిమ తేదీ ప్రారంభం – ఆగస్టు 11, ఉదయం 10.38 నుండి పూర్ణిమ తిథి ముగింపు – ఆగస్టు 12. ఉదయం 7 గంటలకు శుభ ముహూర్తం – ఆగస్టు 11 ఉదయం 9:28 నుండి రాత్రి 9.14 వరకు అభిజీత్ ముహూర్తం – మధ్యాహ్నం 12:6 నుండి 12:57 వరకు అమృత్ గఢియలు – సాయంత్రం 6:55 నుండి 8.20 వరకు బ్రహ్మ ముహూర్తం – ఉదయం 04:29 నుండి 5:17 వరకు
రక్షాబంధన్ 2022 భద్ర కాల సమయాలు.. రక్షాబంధన్ రోజున భద్ర కాలం ముగింపు – రాత్రి 08:51 గంటలకు రక్షాబంధన్ రోజున భద్ర పూంచ్ – ఆగస్టు 11 సాయంత్రం 05.17 నుండి 06.18 వరకు రక్షాబంధన భద్ర ముఖ – సాయంత్రం 06.18 నుండి రాత్రి 8.00 వరకు
భద్ర కాలంలో రాఖీ కట్టరు, రక్షా బంధన్ రోజున భద్ర కాలంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వాస్తవానికి ఈ కాలంలో ఎటువంటి శుభ కార్యాలు జరగవు. ఈ అశుభ సమయంలో రాఖీ కూడా కట్టలేరు. శాస్త్రాల ప్రకారం.. భద్ర జన్మించినప్పుడు.. మొత్తం విశ్వాన్ని మింగేస్తుందని, అంతటి దుష్ట శక్తిగా భావించారు. హవనము, యాగాలు, పూజలు మొదలైన శుభ కార్యాలలో ఆటంకాలు సృష్టించేది భద్ర. అందుకే.. భద్ర కాలంలో రాఖీ కట్టరు.
గమనిక: ఇది కేవలం మత విశ్వాసాలు, మత గ్రంథాలు, శాస్త్రాల ప్రకారం, ప్రజల సాధారణ ఆసక్తులను ధృష్టిలో ఉంచుకుని ప్రచురించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..