Shravana Masam 2022: శ్రావణ మాసంలో గంగాజలానికి విశిష్ట స్థానం .. శివయ్యకు ఎలా అభిషేకం చేయాలంటే..

|

Jul 19, 2022 | 8:03 AM

పరమశివుని అభిషేకానికి, శుభకార్యాల్లో ఉపయోగించే పవిత్ర గంగాజలాన్ని ఎక్కడ, ఎలా, ఎక్కడ..  ఉపయోగించారు..  శ్రావణ మాసంలో గంగాజలంతో పూజ  నియమాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..  

Shravana Masam 2022: శ్రావణ మాసంలో గంగాజలానికి విశిష్ట స్థానం .. శివయ్యకు ఎలా అభిషేకం చేయాలంటే..
Shravana Masam 2022
Follow us on

Shravana Masam 2022: హిందూమతంలో.. గంగాజలాన్ని అత్యంత ప్రవిత్రంగా భావిస్తారు. అమృతం వలె పూజనీయమైనదిగా పరిగణించ బడుతుంది. పూజ నుండి  ప్రతి శుభ కార్యంలో గంగాజలం ప్రత్యేకంగా ఉపయోగించబడుతుంది. శ్రావణ మాసంలో గంగా జలానికి మరింత  ప్రాముఖ్యత ఏర్పడుతుంది. ఎందుకంటే శివ భక్తులు మహాదేవునికి గంగా జలంతో అభిషేకం చేయడానికి ఎంతదూరమైనా ప్రయాణిస్తారు. శ్రావణ మాసంలో  శివసాధన విజయవంతం కావాలంటే ఇంట్లోకి గంగాజలం తీసుకురావడం.. పూజించడంతో పాటు.. శివునికి గంగా జలం సమర్పిస్తారు.  పరమశివుని అభిషేకానికి, శుభకార్యాల్లో ఉపయోగించే పవిత్ర గంగాజలాన్ని ఎక్కడ, ఎలా, ఎక్కడ..  ఉపయోగించారు..  శ్రావణ మాసంలో గంగాజలంతో పూజ  నియమాలను గురించి ఈరోజు తెలుసుకుందాం..

శ్రావణ మాసంలో గంగాజలం:
శివునికి ప్రీతిపాత్రమైన నెలలో ఒకటి శ్రావణ మాసం.. ఈ నెలలో వచ్చే మాస శివరాత్రి రోజున శివయ్యకు గంగాజలాన్ని సమర్పిస్తారు. శివరాత్రి రోజున గంగాజలంతో శివుడిని అభిషేకించడం అత్యంత శుభప్రదం. అయితే శివుడికి ప్లాస్టిక్ బాటిల్ లేదా ప్యాకెట్ తో గంగాజలాన్ని  అందించకూడదని గుర్తుంచుకోండి. శివునికి ఎప్పుడూ రాగి పాత్ర ద్వారా గంగాజలాన్ని సమర్పించాలి.

గంగాజలన్ని ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలంటే?
ఇంటికి గంగాజలం తీసుకురావాలనుకుంటే, గంగానదిలో స్నానం చేసిన తర్వాత, రాగి లేదా ఏదైనా లోహంతో చేసిన పాత్రలో గంగా జలాన్ని ఇంటికి తీసుకురావాలి. ఇంట్లో గంగాజలాన్ని తెచ్చిన తరువాత.. ఆ పాత్రను ఈశాన్య దిశలో పవిత్ర స్థలంలో అంటే దేవుని పూజ గదిలో ఉంచాలి

ఇవి కూడా చదవండి

గంగా నీరు ఎందుకు ఉపయోగిస్తారంటే:
సనాతన సంప్రదాయంలో.. పూజాదికార్యక్రమాలకు, శుభకార్యాలకు గంగాజలం ఉపయోగించబడుతుంది. పవిత్ర గంగాజలాన్ని భగవంతుడికి సమర్పించడమే కాదు..  తరచుగా ఈ గంగాజలాన్ని తులసితో పాటుగా చరణామృత రూపంలో దేవాలయంలో పూజారులు ప్రజలకు అందిస్తారు. అమృతం రూపంలో ఉన్న గంగాజలాన్ని పూజాదికార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు, శుభకార్యాల సమయంలో శుద్ధి చేయడానికి కూడా ఉపయోగిస్తారు. గంగాజలాన్ని ఇంటి లోపల, వెలుపల చిలకరించడం ద్వారా, దుష్ట శక్తులు లేదా ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల శక్తి కలుగుతుంది.. సుఖ సంతోషాలు ఇంట్లో ఉంటాయని నమ్మకం.

గంగా జలానికి సంబంధించిన నివారణలు
కొన్ని కారణాల వల్ల నదిలో స్నానం చేయలేకపోతే.. మీరు గంగామాతను ధ్యానిస్తూ స్నానం చేసే నీటిలో కొంచెం.. గంగాజలాన్ని కలుపుకుని స్నానం చేయాలి. గంగాజలానికి సంబంధించిన ఈ పరిహారాన్ని చేయడం వల్ల గంగానదిలో స్నానం చేయడం వంటి పుణ్యఫలితాలు లభిస్తాయని నమ్మకం. ఏవైనా శ్రావణ మాసంలో శివలింగానికి గంగాజలాన్ని అర్పిస్తే.. ఆ భక్తుడిపై శివుడి అనుగ్రహం కలుగుతుందని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

(ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలు , నమ్మకం పై ఆధారపడి ఉంటుంది, దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది.)