Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ పాసు అందుబాటులోకి.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

|

Jun 30, 2023 | 8:46 AM

ఒకొక్కసారి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరి కనిపిస్తారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది.  అయితే బాబా దర్శనం కోసం ఇక నుంచి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. తాజాగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్ధం సరికొత్త వెసులుబాటు తీసుకుని వచ్చింది. భక్తుల కోసం వీఐపీ పాసును  అందుబాటులోకి తెచ్చింది.

Shirdi Sai Baba: షిర్డీ సాయిబాబా భక్తులకు గుడ్ న్యూస్.. వీఐపీ పాసు అందుబాటులోకి.. ఎలా బుక్ చేసుకోవాలంటే..
Shirdi Sai Baba Temple
Follow us on

పిలిస్తే పలికే దైవం షిర్డీ సాయి బాబా అని భక్తుల నమ్మకం. సాయిబాబా దర్శనం కోసం దేశంలోని నలుమూలల నుండి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు షిర్డీకి వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి మాత్రమే కాదు విదేశాల నుంచి కూడా భక్తులు సాయిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఒకొక్కసారి బాబా దర్శనం కోసం భక్తులు బారులు తీరి కనిపిస్తారు. దర్శనం కోసం గంటల తరబడి వేచి చూడాల్సి ఉంటుంది.  అయితే బాబా దర్శనం కోసం ఇక నుంచి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. తాజాగా శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్ధం సరికొత్త వెసులుబాటు తీసుకుని వచ్చింది. భక్తుల కోసం వీఐపీ పాసును  అందుబాటులోకి తెచ్చింది.

సాయి సంస్థాన్ అందించిన ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా భక్తులు షిర్డీ సాయిబాబా దర్శనం, ఆరతి, పూజ, ఇతర సేవలు, సౌకర్యాలను పొందవచ్చు. అయితే ఇందుకోసం కొన్ని నియమాలను అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు సాయి బాబా దర్శనం కోసం వీఐపీ పాసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం..

వీఐపీ పాసు కోసం భక్తులు ఏమి చేయాలంటే.. 

ఇవి కూడా చదవండి
  1. భక్తులు షిర్డీ సాయిబాబా పోర్టల్ లో మొబైల్ నంబర్, OTP లేదా పాస్‌వర్డ్ లేదా ఇ-మెయిల్ ID తో పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాల్సి ఉంది.
  2. ఒకసారి అకౌంట్ లాగిన్ ఉపయోగించిన మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడిని వేర్వేరు ఖాతాల కోసం ఉపయోగించలేరు. అంటే ఒక వ్యక్తి తన ఫోన్ నంబర్ లేదా మెయిల్ ఐడీని ఒక ఖాతా కోసం మాత్రమే ఉపయోగించుకునే సౌలభ్యం ఉంటుంది.
  3. లాగిన్ అయిన తర్వాత, కావాల్సిన సేవల కోసం భక్తుడి పేరు, చిరునామా, ఐడి ప్రూఫ్ వంటి అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
  4. ఫోటో గుర్తింపు కోసం ఆధార్ కార్డ్ / ఓటర్ ఐడి / పాన్ కార్డ్ / పాస్‌పోర్ట్ / రేషన్ కార్డ్ / డ్రైవింగ్ లైసెన్స్ వీటిలో ఏదైనా ఒకదానికి సంబంధించిన సమాచారం నమోదు చేయాలి. షిర్డీకి రాగానే వెరిఫై చేస్తారు.
  5. మీ ప్రొఫైల్‌లో ఇ-మెయిల్ ఐడిని అప్‌డేట్ చేయాలి. భక్తుడు ఇ-మెయిల్ ద్వారా లాగిన్ / కమ్యూనికేట్ చేయాలనుకుంటే.. ఇ-మెయిల్ ఐడిని కలిగి ఉండటం తప్పనిసరి.
  6. భక్తుడు తన ప్రొఫైల్ ద్వారా ఇ-మెయిల్‌ను అప్‌డేట్ చేసిన తర్వాత, ఇ-మెయిల్ ధ్రువీకరణ కోసం ధ్రువీకరణ లింక్ పంపబడుతుంది.
  7. అయితే భక్తులు లాగిన్ లేకుండా.. భక్తులు షిర్డీలో లభించే సేవలను మాత్రమే తనిఖీ చేయగలరు. వీటి కోసం యాక్సెస్ చేయడానికి లాగిన్ అవసరం.
  8. మొబైల్/ఓటీపీ సేవలు అందుబాటులో లేని భక్తులు రిజిస్టర్‌పై క్లిక్ చేసి షిర్డీ బాబా దర్శనానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).