Shirdi Sai Baba Darshan: షిర్డీ సాయినాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు. నవరాత్రుల తొలిరోజైన గురువారం ఉదయం షిర్డీ సాయిబాబా మందిరాన్ని భక్తుల కోసం తెరిచారు. దీంతో బాబా దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహారాష్ట్రలోని సాయిబాబా ఆలయం మూతపడిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రార్థనాలయాలను తెరవడానికి సెప్టెంబర్ నెల 24న ప్రభుత్వం అనుమతించింది. దీంతో నవరాత్రులు తొలిరోజు గురువారం నుంచి ఆలయాన్ని పునఃప్రారంభించాలని షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 5 తర్వాత.. దాదాపు ఏడు నెలల అనంతరం సాయిబాబాను భక్తులు దర్శించుకునేందుకు అనుమతిస్తూ షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయానికి వచ్చే భక్తులు కరోనా మార్గదర్శకాలను పాటించాలని, మాస్కులను తప్పనిసరిగా ధరించాంలని సూచించింది.
అయితే.. ప్రతిరోజూ 15 వేల మందికి మాత్రమే సాయి దర్శనం లభించనుంది. ఇందులో 5 వేల వరకు పెయిడ్ పాసులు, 5 వేల ఆన్‌లైన్ పాసులు, 5 వేల ఆఫ్ లైన్ పాసులు ఉంటాయి. అంటే గంటకు దాదాపు 1,150 మంది షిర్డీ సాయినాథుడి దర్శనం కల్పించనున్నట్లు సంస్థాన్ ట్రస్ట్ తెలిపారు. ఆర్తి సేవకు కేవలం 90 మంది భక్తులను మాత్రమే అనుమతించనున్నారు. గర్భిణీలు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు దాటిన వారిని ఆలయంలోకి అనుమతించరని ముందస్తుగానే వెల్లడించారు. కొవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు.
షిర్డిలో ప్రారంభమైన భక్తుల దర్శనాలు..
!!ॐ साईं राम !! *श्री साईबाबा संस्थान विश्वस्त व्यवस्था,शिर्डी*
*!!ॐ Sai Ram!! *Shri Saibaba Sansthan Trust, Shirdi*
*आरती :- शिर्डी माझे पंढरपूर*
*गुरूवार ०७ ऑक्टोबर २०२१*
*Aarti : – Shirdi Majhe Pandhrpur*
*Thursday 07 October 2021* pic.twitter.com/aC7a85cUt3— Saibaba Trust Shirdi (@SSSTShirdi) October 7, 2021
Also Read: