
Shardiya Navratri 2025
పవిత్రమైన శారదీయ నవరాత్రి పండుగ 2025 సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమై, 2025 అక్టోబర్ 1 వరకు కొనసాగుతుంది. ఈ పండుగ దుర్గాదేవి తొమ్మిది రూపాలకు అంకితం చేయబడింది. ఈ సమయంలో భక్తులు ఉపవాసం ఉండి నవ దుర్గలకు పూజలు చేస్తారు. అదే సమయంలో నవరాత్రి ఉత్సవాల సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం చాలా ముఖ్యం. కనుక ఈ రోజు నవరాత్రి సమయంలో మనం ఏమి చేయాలి? ఏమి చేయకూడదో ఈ రోజు తెలుసుకుందాం..
నవరాత్రులలో ఏమి చేయాలంటే
- కలశ స్థాపన, పూజ – నవరాత్రి మొదటి రోజున శుభ సమయంలో కలశాన్ని ప్రతిష్టించండి. ఇది దేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి చిహ్నం. దీని తరువాత తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించండి.
- పరిశుభ్రత – నవరాత్రి సమయంలో ఇంటిని, పూజ స్థలాన్ని పూర్తిగా శుభ్రంగా ఉంచుకోండి. ఇది ఇంట్లోకి సానుకూల శక్తిని తెస్తుంది.
- అఖండ జ్యోతి – నవ రాత్రి ప్రారంభం రోజున అఖండ జ్యోతిని వెలిగించాలని కోరుకుంటే.. తొమ్మిది రోజుల పాటు అఖండ జ్యోతిని ఆరిపోకుండా చూసుకోండి. ఇది ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది.
- సాత్విక ఆహారం – ఉపవాసం ఉన్నవారు పండ్లు, పాలు, వాటర్ చెస్ట్నట్ పిండి మొదలైన సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి.
- మంత్రాలు జపించండి – నవరాత్రి సమయంలో దుర్గాదేవికి సంబంధించిన మంత్రాలను జపించండి. దుర్గా సప్తశతి పఠించండి. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. పూజ ఫలితాలను ఇస్తుంది.
- దానధర్మాలు – నవరాత్రి సమయంలో దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కనుక ఈ కాలంలో అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయండి.
నవరాత్రులలో ఏమి చేయకూడదంటే
- తామసిక ఆహారం – నవరాత్రుల తొమ్మిది రోజులలో తామస ఆహారాన్ని అస్సలు తీసుకోవద్దు. తామస వస్తువులను తినడం వల్ల శరీరంలో ,మనసులో బద్ధకాన్ని, మందకొడితనాన్ని కలిగిస్తాయి. దీంతో పూజకు ఆటంకం కలుగుతుంది.
- జుట్టు, గోర్లు – నవరాత్రి సమయంలో జుట్టు, గోర్లు కత్తిరించవద్దు. ఇది శుభప్రదంగా పరిగణించబడదు.
- తోలు వస్తువులు: ఉపవాస సమయంలో బెల్టులు, పర్సులు, బూట్లు, చెప్పులు మొదలైన తోలు వస్తువులను ఉపయోగించవద్దు.
- మద్యం, పొగాకు – ఈ కాలంలో మద్యం, పొగాకు వినియోగం నిషేధించబడింది. ఈ విషయాలు ఆరాధన పవిత్రతకు భంగం కలిగిస్తాయి.
- పగలు నిద్రపోవద్దు – మీరు ఉపవాసం ఉండి ఉంటే… ఎట్టి పరిస్థితుల్లోనూ పగలు నిద్రపోకుండా ఉండండి. ఇలా నిద్రపోవడం వలన ఉపవాసం చేసిన ఫలితం ఉండదు.
- ఎవరినీ అగౌరవపరచవద్దు – ఈ సమయంలో ఎవరినీ, ముఖ్యంగా స్త్రీలను, పెద్దలను అగౌరవపరచవద్దు. ఎందుకంటే దుర్గాదేవి స్త్రీ శక్తికి చిహ్నం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు