మానవత్వం పరిమళించిన వేళ.. హిందూ మహిళకు అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం యువకుడు..
రాజస్థాన్‌లోని భిల్వారాలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. ఒక ముస్లిం యువకుడు మరణించిన హిందూ మహిళకు అంత్యక్రియలను నిర్వహించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం చితి వెలిగించి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇప్పుడు అస్థికలను కూడా త్రివేణీ సంగమ క్షేత్రంలో నిమజ్జనం చేస్తానని చెప్పాడు ఆ యువకుడు. మాసి నన్ను ప్రేమించినంతగా తన తల్లి కూడా ప్రేమించలేదని కన్నీరు చెప్పాడు ఆ యువకుడు నిజానికి మరణించిన ఆ మహిళ.. ఈ ముస్లిం యువకుడు ఇరుగుపొరుగు. అయితే ఇద్దరి మధ్య తల్లీ కొడుకుల సంబంధం ఉంది.

మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వం తరచుగా కనిపిస్తూనే ఉంటుంది. అనేక ప్రాంతాల్లో హిందువులు, ముస్లింలు అన్నదమ్ముల వలనే కలిసి మెలసి జీవిస్తారు. అయితే తమ పొరుగున నివసిస్తున్న హిందూ మహిళ మరణిస్తే.. ఆమెకు అన్నీ తానై హిందూ సంప్రదాయంలో అంత్యక్రియలు నిర్వహించిన ముస్లిం కొడుకు గురించి మీకు తెలుసా..! అవును, రాజస్థాన్‌లోని భిల్వారాలో అలాంటి హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఇక్కడ 67 ఏళ్ల హిందూ మహిళ మరణించింది. ఇప్పటికే భర్త, కొడుకుని పోగొట్టుకున్న ఆ మహిళకు 42 ఏళ్ల ముస్లిం యువకుడు కొడుకుగా మారాడు. ఆమె చితిని వెలిగించాడు. హిందూ సంప్రదాయం ప్రకారం.. ఆమె చితా భస్మాన్ని త్రివేణీ సంగమం క్షేత్రంలో నిమజ్జనం చేస్తానని చెప్పాడు.
ఈ విషయం తెలిసిన తర్వాత తల్లీ కొడుకుల మధ్య ఉన్న ఈ ప్రత్యేకమైన సంబంధాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సంఘటన చాలా అరుదుగా కనిపిస్తుందని వారు చెబుతున్నారు. 42 ఏళ్ల అస్గర్ అలీ మనియారిలోని జంగి మొహల్లాలో నివసిస్తున్నాడు. అతనికి ఒక చిన్న దుకాణం ఉంది. అలీ .. 67 ఏళ్ల శాంతి దేవి పక్కపక్కనే నివసిస్తున్నారు.
అస్గర్ అలీ శాంతి దేవిగురించి మాట్లాడుతూ.. శాంతా దేవి భర్త సంతల్లో చిన్న దుకాణాలు ఏర్పాటు చేసి జీవించేవారు. నా తల్లిదండ్రులు కూడా అదే పని చేసేవారు. అలా మా ఇద్దరి కుటుంబాల మధ్య 30 ఏళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. మేము ఎప్పుడూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా జీవించలేదు.. ఒకే కుటుంబంలా కలిసి జీవించాము. 2010లో శాంతా దేవి భర్త మరణించిన తర్వాత.. శాంతి దేవి తన కొడుకుతో కలిసి మా పొరుగున నివసించడానికి వచ్చింది. మా రెండు కుటుంబాలు సలీం ఖురేషి ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం. మేము మొదటి అంతస్తులో,,శాంతి దేవి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండేవాళ్ళం.
నా తల్లికి ఒక సోదరిలా అండగా నిలిచినా శాంతాదేవి
2017 లో మా నాన్న చనిపోయాడు… అప్పుడు నా తల్లిని శాంతాదేవిని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ఒక సోదరిలా అండగా నిలిచింది. నేను శాంతి దేవిని మాసి అని పిలిచేవాడిని అని చెప్పాడు. ఆ తర్వాత 2018 లో శాంతి దేవి కొడుకుపై ఒక అడవి జంతువు దాడి చేయగా.. అతను చనిపోయాడు. అప్పటి నుంచి శాంతి దేవి మాతోనే జీవించడం మొదలు పెట్టింది. మేము ఒక కుటుంబంలా జీవించాము. ఆమె నన్ను తల్లిలా ప్రేమించింది. నా తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. అప్పుడు నేను తల్లిదండ్రులు లేని ఒంటరి అనుకోలేదు. శాంతాదేవి నన్ను తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంది. అమ్మని మరపించేలా ప్రేమని చూపించింది.
ప్రతి జన్మలో నాకు ఇలాంటి తల్లే కావాలి
శాంతా దేవి అమ్మలా ఎన్నో సేవలు చేసేది. శీతాకాలంలో స్నానానికి నీళ్ళు వేడి చేసేది. బట్టలు ఉతికేది. నేను పని నుండి తిరిగి వచ్చే వరకూ ఎదురు చూసేది. నా భార్య కూడా మాసి మా తీసుకున్నంతగా నా ఆహారం , పానీయాల గురించి పట్టించుకోదు. ఆమె గౌరవార్థం, నేను మా ఇంట్లో మాంసాహారం వండటం, తినడం మానేశాను. మేము ఈద్ , దీపావళిని కలిసి సంతోషంగా జరుపుకునేవాళ్ళం. శాంతి అమ్మ కొంతకాలంగా అనారోగ్యంతో ఉంది. ఇప్పుడు ఆమె మరణించినప్పుడు.. ఒక కొడుకుగా మారి ఆమెకు హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశానని చెప్పాడు.
శాంతి దేవి అస్థికలను ఆమె కోరిక మేరకు ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో లేదా చిత్తోర్‌గఢ్‌లోని మాతృకుండియలో నిమజ్జనం చేస్తానని తెలిపాడు. ఇప్పుడు అమ్మలాంటి మాసీ కూడా నన్ను విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు పూర్తిగా ఒంటిరి అయిపోయాను అంటూ కన్నీరు పెట్టాడు అస్గర్ అలీ. నా బాధను నేను ఎవరికీ చెప్పుకోలేను. ప్రతి జన్మలోనూ నాకు ఇలాంటి తల్లి లభించాలని ప్రార్థిస్తున్నానని చెప్పాడు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




