Sharad Purnima: ఈ రోజు చంద్రకాంతిలో ఖీర్ ఎందుకు పెడతారు.. ఎలా? ఏ సమయంలో పాయసాన్ని పెట్టాలంటే..

శరత్ పూర్ణిమ ఈ రోజు (అక్టోబర్ 6 సోమవారం) జరుపుకుంటున్నారు. ఏడాదిలో వచ్చే అన్ని పున్నముల కంటే ఈ శరత్ పున్నమికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. లక్ష్మీదేవి, చంద్రుడుకి పూజ చేసి బియ్యం పాయసాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. అంతేకాదు ఈ రోజు రాత్రి చంద్రకాంతిలో అ పాయసాన్ని ఉంచుతారు. కానీ దీని వెనుక ఉన్న కారణం ఆధ్యాత్మిక నమ్మకం, శాస్త్రీయ కోణం ఏమిటో తెలుసా..

Sharad Purnima: ఈ రోజు చంద్రకాంతిలో ఖీర్ ఎందుకు పెడతారు.. ఎలా? ఏ సమయంలో పాయసాన్ని పెట్టాలంటే..
Sharad Purnima

Updated on: Oct 06, 2025 | 10:02 AM

ఈ సంవత్సరం శరత్ పున్నమి పండుగను ఈ రోజున జరుపుకుంటున్నారు. ఈ రోజును అమృత వర్షం కురిసే రోజుగా పరిగణిస్తారు. దీనికి హిందూ మతంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శరత్ పున్నమిని, కాముడు పున్నమి, కోజాగరి పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున సంపద దేవత అయిన లక్ష్మీదేవి భూమిపై తిరుగుతూ.. తనను పూజించే వారిపై తన ఆశీస్సులను కురిపిస్తుందని విశ్వాసం. శరత్ పున్నమి రాత్రి ఆకాశం కింద ఖీర్ ఉంచే సంప్రదాయం ఉంది. ఈ రాత్రి చంద్రుడు వెన్నెల నుంచి అమృత వర్షం కురిపిస్తుందని చెబుతారు. ఈ రోజున ఖీర్‌ను చంద్రకాంతి కింద ఉంచడానికి గల కారణాన్ని తెలుసుకుందాం.

శరత్ పున్నమి రోజున ఖీర్ ఎందుకు తయారు చేస్తారు?

బియ్యంతో చేసే పాయసాన్ని స్వచ్ఛత, పవిత్రత, శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. ఈ రోజున ఖీర్ తయారు చేసి లక్ష్మీ దేవికి నైవేద్యం పెట్టడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్మకం. ఖీర్‌ని తయారు చేసేందుకు ఉపయోగించే పాలు, బియ్యం ఆహారం, పోషణకు చిహ్నంగా కూడా పరిగణించబడుతుంది. ఈ కారణంగా శరత్ పున్నమి రోజున ఖీర్‌ను తయారు చేసి లక్ష్మీ దేవికి నైవేద్యం పెడతారు.

వెన్నెలలో ఎందుకు ఉంచుతారు?

మత విశ్వాసం ప్రకారం, శరత్ పూర్ణిమ రాత్రి చంద్రకాంతిలో ఉంచిన ఖీర్ (బియ్యం పాయసం) పై అమృతం కురుస్తుంది. ఈ పాయసం తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. శరీర వేడిని తగ్గిస్తుంది. సంపద, శ్రేయస్సు లభిస్తుంది. ఈ పాయసం చర్మ వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని, కంటి చూపును మెరుగుపరుస్తుందని కూడా నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

పున్నమి వెన్నెలలో ఖీర్ పెట్టుకోవడం వల్ల ఏమి జరుగుతుంది?

అమృతం లాంటి ప్రభావం: శరత్ పూర్ణిమ రాత్రి చంద్రుని కిరణాలు అమృతం లాంటివని .. ఈ అమృతం ఈ కాంతిలో ఉంచిన ఖీర్‌లో కలిసిపోతుందని నమ్ముతారు. దీనివల్ల ఖేర్ ఔషధ గుణాలను పొందుతుంది.

లక్ష్మీదేవి ఆశీస్సులు: ఇలా వెన్నెలల లో పెట్టిన ఖీర్ తినడం వల్ల మంచి ఆరోగ్యం, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి. ఈ ఖీర్ తినడం వల్ల చంద్రదోషం (చంద్రుని దోషం) తొలగిపోవడమే కాదు లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కూడా లభిస్తుంది.

ఆరోగ్య ప్రయోజనాలు: ఈ ఖీర్ తినడం వల్ల శరీర వేడి తగ్గుతుందని, పిత్త రుగ్మత తగ్గుతుందని.. అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నమ్ముతారు.

సంపద, శ్రేయస్సు: లక్ష్మీదేవి అవతార ఉత్సవాన్ని కూడా శరద్ పూర్ణిమ నాడు జరుపుకుంటారు. ఈ ఖీర్‌ను లక్ష్మీ దేవికి సమర్పించి ప్రసాదంగా తినడం ద్వారా ఆశీర్వాదం లభిస్తుంది. ఇంట్లో సిరి సంపదలకు లోటు ఉందని నమ్మకం.

వెన్నెలలో ఖీర్‌ను ఎలా ఏ సమయంలో పెట్టాలంటే

శరత్ పున్నమి నాడు ఆవు పాలు, బియ్యం, చక్కెరతో ఖీర్ తయారు చేయండి. ఇలా తయారు చేసిన ఖీర్ ను వెండి గిన్నెలో కానీ.. కుండలో గానీ వేసి రాత్రంతా ఇంటి పైకప్పు లేదా బాల్కనీపై ఆకాశం కింద చంద్రుడి వెన్నెల కిరణాలు తగిలేలా ఉంచండి. కీటకాలు ఖీర్ లో పడకుండా ఉండటానికి ఖీర్‌ను జల్లెడతో కప్పండి. తరువాత ఈ ఖీర్‌ను రాత్రంతా చంద్రకాంతిలో ఉంచండి. అమృతం వంటి వెన్నెల కిరణాలు ఆ ఖీర్ ని తాకేలా పెట్టండి. మర్నాడు ఈ ఖీర్ ను దేవుడికి సమర్పించి ఇంటిలోని సభ్యులు ప్రసాదంగా తినండి.

హిందూ క్యాలెండర్ ప్రకారం భద్ర కాలం అక్టోబర్ 6న మధ్యాహ్నం 12:23 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 6న రాత్రి 10:53 గంటలకు ముగుస్తుంది. భద్ర కాలం ముగిసిన తర్వాత మాత్రమే ఖీర్‌ను చంద్రుని కాంతిలో ఉంచాలి. ఈ రోజు రాత్రి 10:37 నుంచి అక్టోబర్ 7న తెల్లవారుజామున 12:09 గంటల మధ్య ఎప్పుడైనా ఖీర్‌ను వెన్నెల్లో ఉంచవచ్చు.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.