హిందూ మతంలో శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా పరిగణిస్తారు. శనీశ్వరుడు ప్రతి వ్యక్తికి తన కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడని అంటారు. శనీశ్వరుడిని ఆరాధించిన వారి జీవితంలోని అన్ని బాధలు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. తప్పుడు పనులు చేసే వారికి శని మహాదశ, ఏలి నాటి శనిలో వారి కర్మల ఫలాలు లభిస్తాయి. శనీశ్వరుని జన్మదినాన్ని జ్యేష్ఠ, వైశాఖ మాసాలలో అమావాస్య రోజున జరుపుకుంటారు. శని మహారాజుని ఆచార వ్యవహారాలతో పూజిస్తారు. అటువంటి పరిస్థితిలో, ఈ సంవత్సరం 2024లో శని జయంతి ఎప్పుడు వచ్చింది? శని దేవుడిని పూజించే సమయం ఏమిటో తెలుసుకుందాం.
వ్యాసుని ప్రకారం దక్షిణ భారతదేశంలో అమావాస్య క్యాలెండర్ ను అనుసరిస్తారు. ఈ క్యాలెండర్ ప్రకారం శనిశ్వరుడి జన్మదినోత్సవాన్ని వైశాఖ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అయితే ఉత్తర భారతదేశంలోని పూర్ణిమ క్యాలెండర్ ను అనుసరిస్తారు. దీంతో ఉత్తర భారత దేశంలో శనిదేవుని జన్మదినోత్సవాన్ని జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. అందువల్ల కొన్ని రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తేదీన శని జయంతి జరుపుకుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం సూర్యపుత్రుడు శనిస్వరుడి ఈ తేదీన జన్మించాడు. తండ్రి సూర్య నారాయణుడు, మరియు తల్లి ఛాయ దేవిల బిడ్డ అని చెబుతారు.
శని జయంతి సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలోని అమావాస్య తిథి మే 7న ఉదయం 11:40 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మే 8న ఉదయం 08:51 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం శని జయంతి 8 మే 2024 న జరుపుకుంటారు. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం, ధ్యానం, పూజలు, తపస్సులు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. శనిదేవుని ఆరాధించడం ద్వారా శని మహాదశ నుండి ఉపశమనం పొంది జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి.
వేద క్యాలెండర్ ప్రకారం ఈసారి జేష్ఠ మాసంలోని కృష్ణ పక్ష అమావాస్య తిథి జూన్ 5, బుధవారం సాయంత్రం 7:54 గంటలకు ప్రారంభమవుతుంది, ఇది మరుసటి రోజు జూన్ 6 గురువారం సాయంత్రం 06:07 వరకు కొనసాగుతుంది. అటువంటి పరిస్థితిలో, ఉదయ తిథి ఆధారంగా, జ్యేష్ఠ అమావాస్య శని జయంతి 6 జూన్ 2024 న జరుపుకుంటారు.
శని దేవుడిని కర్మ దాత అని పిలుస్తారు. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉన్నట్లయితే లేదా జాతకంలో శని స్థానం బలహీనంగా ఉన్నట్లయితే.. శని జయంతి రోజున ఉపవాసం ఉండి, ఆచారాల ప్రకారం శని దేవుడిని పూజించాలి. పూజ తర్వాత శని దేవుడికి ఆవాల నూనె, నల్ల నువ్వులు, నీలిరంగు పువ్వులు, శమీ ఆకులు, నల్ల గుడ్డ, మినప పప్పు మొదలైనవి సమర్పించండి. శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శని చాలీసా, శని స్తోత్రాన్ని పఠించవచ్చు. శని దేవుడి మంత్రాలను కూడా పఠించవచ్చు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు