Shani Jayanti 2022: శని దోషం పోవాలంటే.. నలుపు రంగు దుస్తులు దానం ఎందుకు చేస్తారో తెలుసా..

|

May 28, 2022 | 9:05 AM

శనీశ్వరుడు నల్లటి వస్తువులు అంటే చాలా ఇష్టం అని భక్తుల నమ్మకం. కనుకనే ఆయన్ని పూజించే సమయంలో ప్రత్యేకంగా నలుపు రంగు వస్తువులను ఉపయోగిస్తారు.

Shani Jayanti 2022: శని దోషం పోవాలంటే.. నలుపు రంగు దుస్తులు దానం ఎందుకు చేస్తారో తెలుసా..
Shaneshwara Puja
Follow us on

Shani Jayanti 2022: శని జయంతిని ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలోని అమావాస్య రోజున జరుపుకుంటారు. ఈ రోజున ప్రజలు శనిశ్వరుని అనుగ్రహం పొందడానికి హిందూ సంప్రదాయం ప్రకారం శని దేవుడిని పూజిస్తారు. నల్ల బట్టలు, నల్ల నువ్వులు, మినపప్పు, నల్ల నువ్వులు, నల్ల శనగలు, ఇనుము మొదలైన నల్ల వస్తువులను దానం చేయండి. శనీశ్వరుడు  నల్లటి వస్తువులు అంటే చాలా ఇష్టం అని భక్తుల నమ్మకం. కనుకనే ఆయన్ని పూజించే సమయంలో ప్రత్యేకంగా నలుపు రంగు వస్తువులను ఉపయోగిస్తారు. అయితే ఆయనకు నల్లటి వస్తువులు ఎందుకు ఇష్టమో తెలుసా? శనీశ్వరుడు లోకబంధవుడు సూర్యుడి కుమారుడు. ఈరోజు శనీశ్వరుడికి నల్లటి వస్తువులు ఎందుకు ఇష్టమో తెలుసుకుందాం.

పురాణాల కథనం ప్రకారం.. సూర్య భగవానుడు దక్ష ప్రజాపతి కుమార్తె సంధ్యను వివాహం చేసుకున్నాడు. సంధ్య, సూర్యుడికి మను, యముడు, యమున అనే ముగ్గురు పిల్లలు. అయితే సంధ్యా దేవి సూర్యభగవానుని తేజస్సును భరించలేకపోయింది. అందుకే తన నీడకు .. (ఛాయ) మనిషి రూపాన్ని ఇచ్చి తన స్థానంలో ఉంచి .. తన పుట్టింటికి వెళ్ళింది. సంధ్య నీడ ఛాయా దేవి రూపం , గుణము సరిగ్గా సంధ్యా దేవి లాగా ఉంది. దీంతో సూర్యభగవానుడు ఛాయ  నిజానికి సంధ్య  ప్రతిరూపమని తెలుసుకోలేకపోయాడు. కొంత కాలం తర్వాత దేవి ఛాయ గర్భవతి అయింది. గర్భధారణ సమయంలో.. ఛాయా దేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసేది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి , ఆయన జననం సూర్య గ్రహణములో జరిగింది. శనీశ్వరుడు చాలా నల్లగా జన్మించాడు. పుట్టిన సమయంలో పోషకాహార లోపంతో ఉన్నాడు. నల్లని కొడుకుని చూసి సూర్య భగవానుడికి కోపం వచ్చింది. దీంతో  శనిశ్వరుడిని తన కొడుకుగా అంగీకరించడానికి నిరాకరించాడు. తండ్రి నిరాదరణకు శని చాలా బాధపడ్డాడు.

గర్భధారణ సమయంలో.. ఛాయా దేవి శివుని గురించి తీవ్రమైన తపస్సు చేసేది. అందుకే ఆమెకు శివుడి అనుగ్రహంతో శక్తి వచ్చింది. తల్లి నుంచి ఆ శక్తులు శనీశ్వరుడికి లభించాయి. అందుకనే శనీశ్వరుడు పుట్టుకతోనే శక్తులతో పుట్టాడు. అయితే తన తండ్రిని తనను బిడ్డగా అంగీకరించలేదని చాలా కోపం వచ్చింది. ఆ కోపంతో సూర్యభగవానుడి వైపు చూశాడు. దీంతో సూర్య భగవానుడి రంగు నల్లగా మారింది. అతనికి కుష్టు వ్యాధి సోకింది. అప్పుడు తన తప్పు తెలుసుకుని.. సూర్య భగవానుడు శివుడిని క్షమించమని కోరాడు. తన తప్పును అంగీకరించి..  శని దేవుడిని గ్రహాలన్నింటిలో కెల్లా అత్యంత శక్తిమంతుడు అవుతాడని ఆశీర్వదించాడు. నలుపు రంగును నిర్లక్ష్యం చేయడం.. తనని నల్లని వాడు అంటూ నిరాదరణగా చూడడంతో శనీశ్వరుడు నలుపు రంగును తన ఇష్టమైన రంగుగా చేసుకున్నాడు. అందుకనే శనీశ్వరుడిని పూజించే సమయంలో నల్లటి వస్తువులు ఉపయోగిస్తారు. నలుపు రంగు వస్తువులను దానం చేస్తారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..