జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి వ్యక్తి తన జీవితంలో కనీసం ఒక్కసారైనా శని ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. శని దోషం వల్ల మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక నమ్మకం. మనిషి చేసిన కర్మలను అనుసరించి శని కొందరికి శుభాలను.. మరికొందరికి అష్టకష్టాలు ఇచ్చే విధంగా ప్రభావం చూపిస్తాడు. శని దేవుని ఆగ్రహము వలన ప్రజల జీవితాలలో, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక , ఆరోగ్య సంబంధిత సంక్షోభం ఏర్పడుతుంది. ఏదేమైనప్పటికీ , శనిదేవుడు అన్ని సమయాలలో సమస్యలను ఇస్తాడనేది నిజం కాదు. శనిదేవుడు ఆశీర్వాదం, కృప ఉన్న వ్యక్తి జీవితం చాలా సంతోషంగా సాగుతుంది. ముఖ్యంగా శని దేవుని అనుగ్రహంతో జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. రాజయోగంతో వెలిగిపోతాడు. పురాణాల ప్రకారం శనీశ్వరుడు సూర్యదేవుడు, ఛాయల సంతానం.
శనీశ్వరుడు న్యాయం, కర్మలను ఇచ్చేవాడు అని పిలుస్తారు. శనీశ్వరుడు మంచి పనులు చేసిన వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. చెడు పనులు చేసినందుకు శిక్షను కూడా ఇస్తాడు. శనీశ్వరుడు దృష్టి చెడు ప్రభావం పడినట్లు అయితే ఆ వ్యక్తికి చెడ్డ రోజులు ప్రారంభమవుతాయని.. పనుల్లో నిరంతరం వైఫల్యాలు ఎదుర్కొంటారని ఒక నమ్మకం. శనిదోషం మనిషి జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దీంతో మనిషి చాలా కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. శనిదోషం.. ప్రభావం తగ్గించడానికి, శనీశ్వరుడు అనుగ్రహం పొందడానికి, జ్యోతిషశాస్త్రంలో కొన్ని చర్యలు పేర్కొనబడ్డాయి. జీవితంలో శనిదోషం తొలగిపోవాలంటే శనివారం నాడు శని దేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు సూచించారు. శనీశ్వరుడుని సంతోషపెట్టడానికి శనివారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం.
శనివారం హనుమంతుడి ఆరాధన: ఏ భక్తుడు హనుమంతుడిని ఆరాధించినా.. అతనిపై సదా శనీశ్వరుడి అనుగ్రహము ఉంటుందని ఒక నమ్మకం. శనీశ్వరుడి అనుగ్రహం పొందడానికి, జాతకంలో శని దోష నివారణ కోసం తప్పకుండ శనివారం హనుమంతుడిని పూజించాలి. ముఖ్యంగా శనివారాల్లో హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించండి.
రావి చెట్టుకి పూజ: హిందూ గ్రంధాలు, పురాణాల ప్రకారం.. రావి చెట్టులో అన్ని దేవతలు, దేవుళ్ళు నివసిస్తారని విశ్వాసం. విష్ణువు, తన భార్య లక్ష్మిదేవి నివాసం రావి చెట్టు. శనీశ్వరుడి.. విష్ణువు రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడికి పరమ భక్తుడు. అటువంటి పరిస్థితిలో రావి చెట్టును పూజించే వ్యక్తి.. శనివారం సూర్యోదయం సమయంలో రావి చెట్టుకు నీరు పోసి.. నువ్వు నూనెతో దీపాలను వెలిగించిన వారిపై ఎల్లప్పుడూ శనీశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. కనుక రావి చెట్టును పూజించడం ద్వారా శనిదేవుడు అనుగ్రహం లభిస్తుంది.
శనీశ్వరుడి మంత్రాలను పఠించడం: శనిదేవుని ఆశీర్వాదం పొందడానికి, జాతకంలోని శనీ ప్రభావాన్ని తగ్గించడానికి.. శనీశ్వరుడికి అంకితం చేసిన మంత్రాలు,చాలీసాను తప్పనిసరిగా పఠించాలి. ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః లేదా ఓం శని శనైశ్చరాయ నమః అనే మంత్రాలను శనివారాల్లో జపించండి. ఇది కాకుండా శని దేవాలయానికి వెళ్లి శని చాలీసా పఠించి.. ఆరతినివ్వండి.
శనివారం ఈ వస్తువులను దానం చేయండి: శనిదోషం తొలగి శనిదేవుని అనుగ్రహం పొందడానికి.. శనివారం నాడు నల్ల నువ్వులు, నల్ల గొడుగు, ఆవాల నూనె, మినుములు, బూట్లు, చెప్పులు దానం చేయాలి. పేదలకు అన్నదానం చేయండి.
ఆవాల నూనె: శనివారం నాడు ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి మనసులో శని దేవుడిని స్మరించుకోండి. దీని తర్వాత శని దేవాలయంలో ఈ నూనెను దానం చేయండి. ఈ పరిహారం శనిదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చినవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)