అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రం అయినవిల్లి. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి స్వయంభువుగా వెలసినట్లు స్థల పురాణం. స్టూడెంట్స్ కు అపారమైన జ్ఞానాన్ని తెలివి తేటలు ఇస్తాడని నమ్మకం. అంతేకాదు వినాయక స్వామికి పెన్నులతో అర్చన చేస్తారు. ఆ పెన్నులను స్టూడెంట్స్ కు పంచిపెడతారు. తాజాగా వినాయకుడిని దర్శించుకున్నారు ప్రముఖ సీనియర్ సినీనటి లక్ష్మీ. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు నటి శ్రీ లక్ష్మి. అర్చిక స్వాములు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రంతో సత్కరించారు అర్చకులు. అయినవిల్లి విగ్నేశ్వరస్వామి ని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు నటి శ్రీ లక్ష్మి. వినాయక స్వామి వారి పెన్నులు ఇచ్చి శ్రీ లక్ష్మిని సర్కరించారు ఆలయ అధికారులు.
విఘ్నాలు తొలగించే ఆది వినాయకుడు అయినవిల్లి వినాయకుడని చెప్పారు. .ఏ పని చేయాలన్నా ముందు వినాయక స్వామికి దర్శించుకోవడం ఆనవాయితీ. కోనసీమలో ప్రసిద్ధి చెందిన అయినవిల్లి వినాయకుడిని దర్శించుకోవడం ఆనందంగా ఉందనీ సంతోషం వ్యక్తం చేసిన నటి శ్రీ లక్ష్మి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..