AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samatha Kumbh-2025: నేడు రామానుజ నూత్తందాది సాముహికపారాయణము

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. మన రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు పెరియ కోయల్‌ నంబీ రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు.

Samatha Kumbh-2025: నేడు రామానుజ నూత్తందాది సాముహికపారాయణము
Samathakubh 2025
Jyothi Gadda
|

Updated on: Feb 12, 2025 | 11:37 AM

Share

స్మరిస్తే పుణ్యం దర్శిస్తే జన్మ ధన్యం అని చాటుతున్నాయి సమతాకుంభ్‌ 2025 బ్రహ్మోత్సవాలు. వార్షికోత్సవాల్లో భాగంగా నేడు రామానుజ నూత్తందాది సామూహిక పారాయణం ప్రధాన ఘట్టంగా నిలవనుంది. భగవద్రామానుజులపై పరమ భక్తితో శిష్యుడు సమర్పించిన 108 పాశురాలే..ఈ నూత్తందాది ! ప్రతీ కీర్తనలో భ‌గ‌వత్‌ త‌త్వంతో పాటు సామాజిక స్ఫూర్తి ప్రకాశిస్తుంది.

సమతా కుంభ్‌ -2025 శ్రీ రామానుజాచార్య-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు.. అత్యంత వైభవంగా సాగుతున్నాయి. వైదిక వెలుగులతో విశ్వమంతా సమతా స్ఫూర్తి ప్రకాశిస్తోంది. ప్రతీ ఒక్కరూ చూసి తీరాల్సిన వేడుకలివి.

బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు ముఖ్య ఘట్టం రామానుజ నూత్తందాది. నూత్తందాది అంటే నూరు పాశురులు కంటే ఎక్కువ. మన రామానుజపై భక్తి ప్రపత్తితో శిష్యుడు పెరియ కోయల్‌ నంబీ రచించి.. పాడిన పాశురాలే నూత్తందాది. రామానుజులకు అళ్వార్లపైన, దివ్యదేశాలపై ఉన్న అపారమైరమైన భక్తిని ఈ పాశురాల్లో కళ్లకు కట్టారు.

ఇవి కూడా చదవండి

సనాతన వేద వైభవాన్ని భక్తులకు అనుగ్రహించిన రామానుజాచార్యులపై ఎనలేని భక్తి విశ్వాసాలతో ఈ నూత్తందాది రచించారు. రామానుజులవారిని ఆశ్రయించిన వారికి సంసారాన్ని జయించే అనుగ్రహము లభిస్తుందని నమ్మకం!

ఆచార్య రామానుజులపై తన భక్తి ప్రపత్తులు ఉప్పొంగి రచించిన ప్రబంధం అత్యద్భుతం! ఇందులో పాశురం చివరి పదం తర్వాతి పాశురం మొదటి పదం అవుతుంది.

అలాగే బుధవారం సాయంత్రం జరిగే విశేష కార్యక్రమాల్లో హనుమద్‌ వాహన సేవ ప్రధానమైనది. హనుమద్‌ వాహనంపై తరలిరానున్న 18 మంది దివ్యదేశాధీశులకు 18 గరుడ సేవలు కొనసాగుతాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
మద్యం సేవించొద్దన్నందుకు..అర్ధరాత్రి పోలీస్‌ని చితకబాదిన NRI బాబు
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
భారీగా కుప్పకూలిన వెండి ధరలు.. ఒకేసారి ఎంతో తెలుసా..?
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఆ హీరోయిన్ రోజూ మద్యం తాగేది.. చివరకు అలా చనిపోయింది
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఇల్లు తుడిచే నీటిలో ఇదొక్కటి కలిపితే చాలు.. క్రిమికీటకాలు పరార్
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
ఏలినాటి శని ఉన్నవారికి షాకింగ్ న్యూస్.. అసలు ఏం జరుగుతుందంటే?
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
టీ తాగుతున్నారా?.. జాగ్రత్త ఈ 6 విషయాలు తెలుసుకోకపోతే.. అంతే!
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
సంజూ శాంసన్ కంబ్యాక్‌కు సిద్ధం.. జట్టులో చోటు దక్కేది ఎవరికో?
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
CSIR UGC NET 2026 జూన్ పరీక్ష రాసే వారికి అలర్ట్.. తాజా అప్‌డేట్‌
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
ప్రజల కలలు, సంకల్పమే దేశ పురోగతికి చోదకశక్తిః ప్రధాని మోదీ
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..
పాన్ కార్డు అసలైందా..? కాదా? ఈ ట్రిక్‌తో గుర్తు పట్టేయండి..