
ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలో శ్రీరామానుజాచార్య దివ్యక్షేత్రంలో సమతాకుంభ్ 2025 బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా సాగుతున్నాయి. విశేషోత్సవాల్లో భాగంగా సమతాకుంభ్ వేడుకల్లో ఆ కన్నుల పండువగా జరుగుతోంది. పెరుమాళ్లకి అలుపు తీరేలా జరిపే ఉత్సవం డోలోత్సవం. ఉపచారాలు, చతర్వేద పారాయణతో స్వామిని నిద్రపుచ్చడమే ఈ డోలోత్సవం వెనుకున్న పరమార్ధం.. గరుడ సేవలు స్వీకరించిన 18 రూపాలలో ఉన్న భగవంతునికి అభిషేకాన్ని జరిపి ఉత్సవ శ్రమను తొలగించేందుకు డోలోత్సవాన్ని జరుపుతున్నారు. పెరుమాళ్లకి మన హృదయ మందిరమే ఊయలగా ప్రేమతో జోలపాడే ఉత్సవమిది.
మది నిండ భక్తితో డోలోత్సవాన్ని దర్శిస్తే డోలాయమానం అంటే సందిగ్ధత పరిస్థితి.. సంశయాలు తొలిగి సకల శుభాలు కలుగుతాయి. ప్రతీ ఆలయంలో రాత్రి సమయంలో ఏకాంత సేవగా పెరుమాళ్లకి సమర్పిస్తారు. సమతామూర్తి రాకతో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి దివ్య సంకల్పంతో ఒకేసారి 18 రూపాలలో ఉన్న పరమాత్మని ఊయలలూపే అద్భుత అవకాశం భక్తులకు అనుగ్రహించారు. మది నిండ భక్తితో డోలోత్సవాన్ని దర్శిస్తే డోలాయమానం అంటే సందిగ్ధత పరిస్థితి.. సంశయాలు తొలిగి సకల శుభాలు కలుగుతాయి.
ఇక సాయంత్రం 6 గంటలకు 18 దివ్య దేశాలకు గరుడ సేవలు నిర్వహించనున్నారు.