సమతా కుంభ్‌ తృతీయ బ్రహ్మోత్సవాల్లో నాలుగు ప్రపంచ రికార్డులు.. మూడు వేల మంది విద్యార్థులతో..

|

Feb 16, 2025 | 7:28 PM

సమతాకుంభ్‌ 2025 బ్రహ్మోత్సవాలు సకల జనుల సంబురంగా సాగుతున్నాయి. నిత్యక్రతువులు.. దేవతారాధనలతో ముచ్చింతల్‌ శ్రీరామనగరం ఇల వైకుంఠాన్ని తలపిస్తోంది. ఉత్సవాల ఏడోరోజు.. ఘంటసాల పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 3 వేల మందితో మహా బృందం చేసిన నాట్యం అందర్నీ ఆకట్టుకుంది. అంతేకాకుండా ఈ బృందం నాలుగు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది.

సమతా కుంభ్‌ తృతీయ బ్రహ్మోత్సవాల్లో నాలుగు ప్రపంచ రికార్డులు.. మూడు వేల మంది విద్యార్థులతో..
Samatha Kumbh 2025
Follow us on

సమతా కుంభ్‌-2025 శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు మధ్యాహ్నం జరిగిన మహానాట్య బృందం 4 ప్రపంచ రికార్డ్స్ నమోదు చేసింది. సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రంలో సమతా కుంభ్‌-2025-108 దివ్యదేశాల తృతీయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఘంటసాల పవన్‌ కుమార్‌ ఆధ్వర్యంలో 3 వేల మంది తో మహా బృందం చేసిన నాట్యం అందర్నీ ఆకట్టుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాల నుంచి వచ్చిన 3 వేల మంది చిన్నారులు వివిధ నృత్య రూపాలతో ఆ దేవదేవుడికి కళాభిషేకం చేశారు. ఇండియన్ వరల్డ్ రికార్డు, వండర్ బుక్ అఫ్ రికార్డ్స్, గోల్డెన్ స్టార్ రికార్డు, జీనియస్ బుక్ అఫ్ రికార్డ్స్ వంటి నాలుగు రికార్డులను నమోదు చేసింది. నృత్యంతో నాలుగు ప్రపంచ రికార్డులు నెలకొల్పిన విద్యార్థులను శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి అభినందించారు.

నృత్య రూపంలో పాల్గొన్న చిన్నారులకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు మంగళ శాసనాలు అందించారు. సనాతన ధర్మాన్ని పాటిస్తూ మన సాంస్కృతిక సంప్రదాయాలను పాటిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులను అభినందించారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..