Naimisharanya: హిందుత్వాన్ని ఎత్తుకున్న సమాజ్ వాద్ పార్టీ.. నైమిశారణ్యంలో మీటింగ్.. ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే..

|

Jun 10, 2023 | 11:37 AM

నెక్ట్ ఎన్నికల నేపథ్యంలో తన స్టాండ్‌ను స్పష్టం చేసిన రాంగోపాల్ యాదవ్.. అసురులను నాశనం చేయడానికి నైమిశారణ్యాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలు రాక్షసుల కంటే తక్కువ కాదని రామ్ గోపాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 2024లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుని బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొట్టిన తర్వాతే చంపేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.

Naimisharanya: హిందుత్వాన్ని ఎత్తుకున్న సమాజ్ వాద్ పార్టీ.. నైమిశారణ్యంలో మీటింగ్.. ఈ క్షేత్ర విశిష్టత ఏమిటంటే..
Naimisharanya
Follow us on

2024 లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాల్లో బిజీ బిజీగా ఉన్నాయి. విపక్షాలు బీజేపీ హిందుత్వ కార్డును తాము కూడా ఓన్ చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెడుతున్నాయి. ఈ కసరత్తులో భాగంగా సమాజ్ వాదీ పార్టీ నేతలు కూడా హిందుత్వ మార్గాన్ని ఎంచుకున్నాయి. నైమిశారణ్యలో పార్టీ ఆధ్వర్యంలో రెండు రోజుల ‘చింతన్ శివిర్’ కార్యక్రమాన్ని  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలేష్ యాదవ్, రాంగోపాల్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్ సహా పార్టీ నేతలంతా పాల్గొన్నారు.

నైమిశారణ్యంలోనే సమాజ్‌వాదీ పార్టీ శిబిరం ఎందుకంటే? 

నెక్ట్ ఎన్నికల నేపథ్యంలో తన స్టాండ్‌ను స్పష్టం చేసిన రాంగోపాల్ యాదవ్..  అసురులను నాశనం చేయడానికి నైమిశారణ్యాన్ని ఎంచుకున్నట్లు చెప్పారు. బీజేపీ నేతలు రాక్షసుల కంటే తక్కువ కాదని రామ్ గోపాల్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 2024లో ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుని బీజేపీని ఢిల్లీ నుంచి తరిమికొట్టిన తర్వాతే చంపేస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు.

ఇవి కూడా చదవండి

నైమిశారణ్యం.. మతపరమైన ప్రాముఖ్యత..

నైమిష అరణ్య అనేది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోమతి నది వెంబడి ఉన్న పురాతన కాలం నాటి అడవి. హిందూమతంలో నైమిశారణ్యానికి విశేష ప్రాధాన్యత ఉంది. చార్ ధామ్ యాత్ర చేసుకున్న భక్తులు నైమిశారణ్యం చేసుకోక పొతే ఆ యాత్ర అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. ఈ విషయాన్నీ విష్ణు పురాణం,  మార్కండేయ పురాణాలలో కూడా ప్రస్తావించారు. ఈ పవిత్ర పుణ్యక్షేత్రంలో పురాణాల ప్రకారం.. ఈ క్షేత్రంలో  ఋషులు, మునుల నివాసంగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో మహాభారతాన్ని రచించిన వేద వ్యాసుని శిష్యుడైన సూత మహర్షి 88 వేల మంది ఋషులకు కౌరవ-పాండవుల కథను వివరించాడని చెబుతారు.

హిందూ మత గ్రంథాల ప్రకారం.. రాముడు ఇక్కడే అశ్వమేధ యాగాన్ని నిర్వహించాడనే విషయం  రామాయణంలో ప్రస్తావించారు. అంతేకాదు ఇక్కడే మహర్షి దధీచి రాక్షసుల నుంచి ప్రజల రక్షించడానికి  ఇంద్రుడికి తన ఎముకలను దానం చేశాడు. అందుకనే ఈ క్షేత్రాన్ని నైమిష అని పేరు పెట్టారు.. అంటే అడవి. ఋషి తపస్సుకు అత్యంత అనుకూలమని స్వయంగా బ్రహ్మదేవుడు చెప్పాడు.

పురాణాల ప్రకారం నైమిశారణ్యం అనేది విశ్వ సృష్టికి అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది.  ప్రపంచంలో మానవ జీవితం ఆవిర్భావం కోసం.. ఇక్కడే బ్రహ్మ ఇక్కడ మనువు , శత్రుపాలను సృష్టించాడు.  వారు ఇక్కడ వేల సంవత్సరాలు తపస్సు చేశారు. అందుకే ఈ భూమిని విశ్వ సృష్టి భూమి అంటారు.

నైమిశారణ్య తీర్థం ఎక్కడ ఉందంటే 
ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ .. ఖైరాఘర్ మధ్య నైమిశారణ్య ఉంది. ఇది భారతదేశంలోని అత్యంత పవిత్రమైన నదులలో ఒకటైన గోమతి ఒడ్డున ఉంది. ఆలయ సముదాయం మధ్యలో ఒక పవిత్ర బావి కూడా ఉంది. దీనిని చక్ర తీర్ధం అని పేరుగాంచింది. భారతదేశంలోని నలుమూలల నుండి భక్తులు ఈ క్షేత్రానికి చేరుకుంటారు. చక్ర తీర్ధంలో స్నానమాచరిస్తారు.

నైమిశారణ్యంలో దర్శనీయ స్థలాలు
పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యత కలిగిన అనేక ప్రదేశాలు ఈ క్షేత్రంలో ఉన్నాయి. ఈ క్షేత్రాన్ని  దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. వ్యాస గడ్డి, శ్రీ లలితా దేవి ఆలయం, దశాశ్వమేధ ఘాట్, స్వయంభూ మను, శతరూప, దధీచి కుండ్,హనుమాన్ గడ్డి , పాండవుల కోట, శేషు శంకర్, బాలాజీ వంటి అనేక సందర్శనీయ ప్రదేశాలున్నాయి. ఈ ప్రదేశాలన్నీ పురాణాలలో మతపరమైన ప్రాముఖ్యతను కలిగి  ఉన్నాయని పేర్కొన్నాయి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).