Hindu Holy Leaves: హిందూ ధర్మంలో ఈ ఏడు ఆకులు పవిత్రమైనవి.. వీటి విశిష్టత ఏమిటంటే..
కొన్ని రకాల ఆకుల వల్ల కేవలం మతపరమైన ప్రయోజనాలే కాకుండా జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలను కూడా తెలియజేశారు. పూజలో చెట్లకు సంబంధించిన ఏ ఆకులను ఉపయోగిస్తారో.. ఏ కోరికలు నెరవేరుతాయి.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
హిందూమతంలో చెట్లు, మొక్కలు మాత్రమే కాకుండా వాటికి సంబంధించిన ఆకులు, కాండం, పండ్లు, విత్తనాలు, వేర్లు మొదలైనవి కూడా చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. పర్వదినాలు, పూజల నుండి అన్ని శుభకార్యాల్లో వివిధ రకాల ఆకులను ఉపయోగిస్తారు. విశేషమేమిటంటే కొన్ని రకాల ఆకుల వల్ల కేవలం మతపరమైన ప్రయోజనాలే కాకుండా జ్యోతిష్య శాస్త్ర ప్రయోజనాలను కూడా తెలియజేశారు. పూజలో చెట్లకు సంబంధించిన ఏ ఆకులను ఉపయోగిస్తారో.. ఏ కోరికలు నెరవేరుతాయి.. వాటి ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం..
మామిడి ఆకు హిందూమతంలో ఏదైనా శుభకార్య సమయంలో లేదా పండగ పూజాది కార్యక్రమాల్లో మామిడి ఆకులను తోరణంగా ద్వారానికి కడతారు. మామిడి ఆకులను పూజలో కలశంలో కూడా ఉపయోగిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం, మామిడి ఆకులకు ప్రతికూలతను తొలగించి తద్వారా సానుకూలతను వ్యాప్తి చేసే శక్తి ఉన్నదని విశ్వాసం. మామిడి ఆకులు శుభానికి ప్రతీక కనుక ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులన్నీ పూర్తవుతాయి.
తులసి ఆకులు సనాతన సంప్రదాయంలో తులసి అత్యంత పూజనీయమైనదిగా పరిగణించబడుతుంది. వైష్ణవానికి సంబంధించిన పూజలలో తులసి ఆకును విష్ణువుకు సమర్పించడానికి ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. తులసిని విష్ణు ప్రియ అని అంటారు. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎలాంటి దుఃఖాలు, అరిష్టాలు ఉండవని నమ్మకం. హిందూ మతంలో తులసి ఆకులను శుద్ధి చేయడానికి నీటిలో వేస్తారు.
తమలపాకు సనాతన సంప్రదాయంలో, తమలపాకు విశిష్ట స్థానం ఉంది. చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దేవతలకు పూజ చేసే సమయంలో తమలపాకు ప్రత్యేకంగా సమర్పించబడటానికి కారణం ఇదే. సనాతన సంప్రదాయంలో తమలపాకు అంగారకుడి చిహ్నంగా భావిస్తారు. తమలపాకును పూజలో మాత్రమే కాకుండా జ్యోతిష్య పరిహారాలకు కూడా ఉపయోగిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తమలపాకు బుధ గ్రహానికి సంబంధించినది.
బిల్వ పత్రం.. బిల్వ పత్రానికి హిందూమతంలో చాలా పవిత్రమైనవిగా పరిగణించబడతాయి. ఎందుకంటే ఇది దేవతల దేవుడైన శివయ్యకు సంబంధించినది. బిల్వ పత్రాన్ని లేదా.. పండుని సమర్పిస్తే శివుని ఆశీర్వాదం లభిస్తుందని కష్టాలు తీరతాయని విశ్వాసం.
జమ్మి ఆకు బిల్వ పత్రాల మాదిరిగానే శమీ ఆకులను కూడా శివునికి సమర్పిస్తారు. హిందూ విశ్వాసం ప్రకారం శంకర భగవానుడికి శమీ పత్రాన్ని సమర్పించడం వల్ల ఎక్కువ పుణ్యఫలం లభిస్తుంది. శివుడితో పాటు జమ్మి ఆకును గణేశుడు, శనీశ్వరుడికి కూడా సమర్పిస్తారు.
అరటి ఆకు సనాతన సంప్రదాయంలో అరటి చెట్టు శ్రీ విష్ణువుకు సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శ్రీ విష్ణువు పూజలో అరటి ఆకులను ప్రత్యేకంగా ఉపయోగించడానికి కారణం ఇదే. దక్షిణ భారతదేశంలో, ఈ ఆకును చాలా పవిత్రమైనదిగా భావించి.. ఈ అరటి ఆకులో ఆహారాన్ని నైవేద్యంగా పెడతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అరటి చెట్టును పూజిస్తే దేవగురువు బృహస్పతి ఆశీస్సులు లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).