మణికంఠుడి యోగదండం మాయం..హరిహరసుతుడి ఏకముఖి రుద్రాక్షమాల ఖతం!
ఏ ఆలయానికైనా వెళ్లండి ముందుగా కనిపించేది ద్వారపాలకులే. శబరిమల ఆలయంలోనూ ఉంటారు. పరమ పవిత్రమైన 18మెట్లు ఎక్కిన తరువాత గర్భగుడికి ఇరువైపులా కనిపిస్తారు. ఆ ద్వారపాలకులకు బంగారు తాపడం పెట్టి ఉంటుంది. దాన్ని నాలుగైదేళ్లకోసారి మారుస్తుంటారు. ఎక్కడ మారుస్తారో తెలుసా. ఎక్కడో ఉన్న చెన్నైలో. అది కూడా శబరిమల నుంచి చెన్నై చేరడానికి 30, 40 రోజులు పడుతుందట. అసలు బంగారు తాపడానికి చెన్నై తీసుకెళ్లడమేంటి? అక్కడికి చేరడానికి మండలదీక్ష అంత సమయం పట్టడమేంటి?

అయ్యప్ప క్షేత్రంలో అపచారం జరుగుతోంది. శబరిమలలో బంగారం కనిపించకుండా పోతోంది. బంగారం సంగతి అటుంచుదాం. అత్యంత పవిత్రమైన స్వామివారి యోగదండం మాయం చేశారు. కేరళ గవర్నమెంట్.. ‘యోగదండం మాయం అయిందని ఎవరు చెప్పారు మీకు’ అంటోంది. భక్తులు మాత్రం యోగదండం ఉంది… కాని, అక్కడున్నది అసలైనది కాదు నకిలీది అంటున్నారు. అయ్యప్ప పక్కనే గర్భగుడిలో భద్రంగా ఉండాల్సిన యోగదండం ఆలయ గడప దాటి బయటికెళ్లింది ముమ్మాటికీ వాస్తవం. మళ్లీ తీసుకొచ్చి పెట్టిందీ వాస్తవమే. మరి స్ట్రాంగ్ రూమ్ రిజిస్టర్‌లో ఆ వివరాలెందుకు లేవు? అది అటుంచుదాం. హరిహరసుతుడి మెడలో ఉండాల్సిన ఏకముఖి రుద్రాక్ష మాల సంగతేంటి? అది పోతే ఇంకోటి అనుకోడానికి లేదిక్కడ. ఎందుకంటే ఆ రుద్రాక్షల విలువ అమూల్యం. అస్సలు వెల కట్టలేం. వందల ఏళ్లుగా దైవసమానంగా భక్తులు ఆరాధిస్తున్న స్వామివారి సొత్తు అది. అదేంటో కొన్నేళ్లుగా శబరిమల వివాదాలకు కేరాఫ్‌గా కనిపిస్తోంది. కాదు.. రాజకీయ వివాదాలకు, ఎన్నికల తంతుకు శబరిమలను ఒక వేదికగా ఉపయోగించుకుంటున్నాయి పార్టీలు. ఇంతకీ.. శబరిమలలో చొరబడిన దొంగలెవరు? మణికంఠుడి ఆలయం నుంచి ఏమేం ఎత్తుకెళ్లారు ఇప్పటివరకు? ఈ దోపిడీపర్వం ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలైంది. ఏ ఆలయానికైనా వెళ్లండి ముందుగా కనిపించేది ద్వారపాలకులే. శబరిమల ఆలయంలోనూ ఉంటారు. పరమ పవిత్రమైన 18మెట్లు ఎక్కిన తరువాత గర్భగుడికి ఇరువైపులా కనిపిస్తారు. ఆ ద్వారపాలకులకు బంగారు తాపడం పెట్టి ఉంటుంది. దాన్ని నాలుగైదేళ్లకోసారి మారుస్తుంటారు. ఎక్కడ మారుస్తారో తెలుసా. ఎక్కడో...




