Sabari Mala Temple : నెలవారీ ఆరాధన కోసం శబరిమల ఆలయాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని జూలై 17 నుంచి 21 వరకు ఆలయం తెరిచే ఉంటుందని అధికారులు తెలిపారు. కరోనావైరస్ మహమ్మారి మధ్య శబరిమల ఆలయం తెరుస్తున్నందున.. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ప్రజలు COVID భద్రతా ప్రోటోకాల్‌ను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. ఆలయంలో ప్రజల ప్రవేశం కోసం కొన్ని నియమాలు రూపొందించారు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.
1. కరోనా టీకాలు వేసుకున్న భక్తులకు మాత్రమే ఆలయాన్ని సందర్శించడానికి అనుమతిస్తారు. అంతేకాకుండా COVID టీకా సర్టిఫికేట్ సమర్పించాలి.
2. 48 గంటల కరోనా నెగటివ్ రిపోర్ట్ చూపించే వారిని కూడా ఆలయం లోపలకు అనుమతిస్తారు.
3. ఆన్‌లైన్ బుకింగ్ విధానం ద్వారా 5 వేల మంది మాత్రమే ఆలయంలోకి ప్రవేశించగలరు.
కేరళలో కరోనా పరిస్థితి..
రాష్ట్రంలో ప్రతిరోజూ 15 వేల కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేరళలో 14087 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి, 109 మంది మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా డేటా గురించి మాట్లాడితే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,766 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో మరోసారి మరణించిన వారి సంఖ్య వెయ్యి దాటింది. ఈ కాలంలో కోవిడ్ పాజిటివ్ కారణంగా 1206 మంది ప్రాణాలు కోల్పోయారు. రికవరీ గురించి మాట్లాడుతూ.. కొత్త కేసుల నుంచి రికవరీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గత 24 గంటల్లో 45,254 మంది రోగులు కోలుకున్నారు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇప్పుడు కరోనా మొత్తం కేసులు 3,07,95,716 కు పెరిగాయి. మొత్తం రికవరీ 2,99,33,538. ఇవే కాకుండా దేశంలో 4,55,033 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య 4,07,145 కు పెరిగింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం నిన్న దేశంలో కరోనా వైరస్ కోసం 19,55,225 నమూనా పరీక్షలు జరిగాయి. నిన్నటి వరకు మొత్తం 42,90,41,970 నమూనా పరీక్షలు జరిగాయి.