AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nellore: ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తజనం.. సందడిగా పరిసరాలు

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి వేదికగా నిలుస్తున్న నెల్లూరు (Nellore) బారాషహీద్ దర్గా లో రొట్టెల పండుగ (Rottela Panduga) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం (ఇవాళ్టి) నుంచి అయిదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఘనంగా...

Nellore: ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ.. తరలివస్తున్న భక్తజనం.. సందడిగా పరిసరాలు
Rottela Panduga
Ganesh Mudavath
|

Updated on: Aug 09, 2022 | 5:30 PM

Share

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, మతసామరస్యానికి వేదికగా నిలుస్తున్న నెల్లూరు (Nellore) బారాషహీద్ దర్గా లో రొట్టెల పండుగ (Rottela Panduga) ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం (ఇవాళ్టి) నుంచి అయిదు రోజుల పాటు జరగనున్న ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పండుగలో సందడి లేకుండా పోయింది. ఈ సారి కరోనా తగ్గుముఖం పట్టడం, ప్రభుత్వం నిబంధనలను సడలించడంతో భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. 9న సొందల్‌ మాలీతో మొదలయ్యే ఉత్సవాలు.. 10న గంధోత్సవం(జియారత్‌), 11 రొట్టెల పండగ, 12న తహనీల్‌ ఫాతెహా, 13 న సాంస్కృతిక కార్యక్రమాలలో పండుగ ముగుస్తుంది. ఉత్సవాలలో 10, 11 తేదీల్లో జరిగే కార్యక్రమాలు విశిష్టమైనవి. కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని కలుపుకొని ఊరేగింపుగా తీసుకొస్తారు. ఈ అపురూప ఘట్టాన్ని చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. వివిధ కోరికల పేరుతో ఇక్కడ రొట్టెలు తీసుకోవడం సంప్రదాయం. అయితే రొట్టె తీసుకున్నాక కోరిక నెరవేరితే వచ్చే సారి తప్పకుండా రొట్టె విడవాలనేది ఆనవాయితీగా వస్తోంది.

ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వర్ణాల చెరువులో పుష్కర ఘాట్‌, జల్లు స్నాన ఘట్టాలు నిర్మించారు. దుస్తులు మార్చుకోవడానికి గదులు, తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేశారు. అవాఛనీయ ఘటనలు జరగకుండా బారాషహీద్ దర్గా పరిసర ప్రాంతాల్లో సీసీ కెమేరాలు, డ్రోన్లు ఏర్పాటు చేశారు. జిల్లా పోలీసులతో పాటు గుంటూరు, ప్రకాశం జిల్లాల నుంచి పోలీసు బలగాలు పహారా కాస్తున్నాయి. ఉత్సవాలు జరిగే ఐదు రోజులు ప్రతి ఒక్కరూ విధుల్లో ఉండాల్సిందేనని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. నెల్లూరు బారాషహీద్‌ దర్గా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాష్ట్ర పండగగా గుర్తించి, రూ. 15కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొహరం పర్వదినాల్లో హిందూ ముస్లీంలు కలిసి నెల్లూరు చెరువు బారా షహీద్ దర్గా దగ్గర రొట్టెల పండుగను ఘనంగా నిర్వహిస్తారు. కోరికలు కోరుతూ, నెరవేరిన కోరికల కోసం మొక్కులు తీర్చుకుంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకునే పద్ధతిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆర్కాటు నవాబు కోరిక నెరవేరడంతో మరుసటి ఏడాది దర్గాకు వచ్చి కృతజ్ఞత తెలియజేస్తూ, స్వర్ణాల చెరువులో రొట్టె విడిచినట్లు ఒక కథనం. ఆ సంఘటనానంతరమే రొట్టెల పండుగ మొదలైందని పెద్దలు చెపుతుంటారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మీక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి