Vidura Niti: మీరు లీడర్ కావాలనుకుంటున్నారా.. విదురుడు చెప్పిన వాటిన పాటిస్తే చాలు.. ఇక తిరుగుండదు..

దగ్గరివారికి అడగకుండానే సలహాలు ఇవ్వమని విదురుడు అంటాడు. చెడు గురించి హెచ్చరించినా వారు వినిపించుకోక పోతే అది వారి నిర్ణయానికే వదిలివేయాలని అంటాడు విదురుడు.

Vidura Niti: మీరు లీడర్ కావాలనుకుంటున్నారా.. విదురుడు చెప్పిన వాటిన పాటిస్తే చాలు.. ఇక తిరుగుండదు..
Vidura
Follow us
Sanjay Kasula

|

Updated on: Aug 12, 2022 | 4:00 PM

విదురుడు(Vidurudu) దూరదృష్టి కలిగిన వ్యక్తి.  ఆయన దూరదృష్టి కారణంగా సమస్యలను ముందుగానే ఊహించేవాడు. కురుక్షేత్ర యుద్ధం ముగియడం కూడా చాలా ఘోరంగా ఉంటుందని విదురుడు ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు. మహాభారత యుద్ధంలో పాండవుల విజయంలో ముఖ్యపాత్ర పోషించిన శ్రీ కృష్ణుడితో కూడా విదురుడి సలహాలు ఉన్నాయి. మహాభారత కాలంలో ఆయన మాటలను ఎంతో గౌరవం ఇచేవారు పాండవులు. భీష్ముడు కూడా విదురుడి సలహా తీసుకునేవాడు. విదుర్ ప్రజలకు సహాయం చేయడం గురించి కొన్ని ప్రత్యేక విషయాలు కూడా చెప్పాడు. వాటి గురించి తెలుసుకుందాం..

విదురుడు చెప్పిన నీతి నాటి కాలం నుంచి నేటి కాలంకు కూడా సరిపోయేలా ఉంటాయి. విదురుడు చెప్పినట్లుగా మీ సంతానంకు కానీ.. మీకు చాలా ప్రియమైన వ్యక్తుల క్షేమం కోరుకుంటున్నారో వారికి మంచితోపాటు చెడు గురించి కూడా హెచ్చరించాలని అంటాడు. ఇలాంటి విషయాలు చెప్పడంలో ఆలస్యం చేయకూడదంటాడు విదురుడు. వారు అడిగే వరకు వేచి ఉండకూడదు.. చెడు గురించి హెచ్చరించినా వారు వినిపించుకోక పోతే అది వారి నిర్ణయానికే వదిలివేయాలని అంటాడు విదురుడు.

ఇలా చేయడం ద్వారా, మీరు అన్ని మంచి విషయాలతోపాటు తప్పు విషయాలపై కూడా వారికి అవగాహన కలిగించినట్లైతే వారు మీపై సంతృప్తితో ఉంటారు. ఇప్పుడు ఆ వ్యక్తి తన మంచి చెడ్డలను చూసి తన నిర్ణయం తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రెండు లాభాలు ఉంటాయి. ముందుగా అన్నీ తెలిసినా హెచ్చరించలేదన్న అపరాధభావం కలగదు. అంతే కాదు.. ఆ వ్యక్తి కూడా భవిష్యత్తులో మీరు తన శ్రేయోభిలాషి అని నమ్ముతారు.

విదురుడి విధానాలే కాకుండా, అతని జీవితమంతా కూడా అదే సందేశాన్ని ఇస్తున్నట్లు అనిపిస్తుంది. విదురుడు స్వయంగా తన విధానాలను దృతరాష్ట్ర మహారాజుకు చెప్పాడు. యువకుడైన దుర్యోధనుడి ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడని.. అతనికి ఫలితం అలానే ఉంటుందని సూచించాడు. దుర్యోధనుడు విదురుడి విధానాలను అస్సలు అంగీకరించలేదు. కానీ దాని ఫలితం కౌరవుల నాశనాకి కారణంగా మారాయి. అవమానం, నిర్లక్ష్యం ఉన్నప్పటికీ.. విదురుడు తన కర్తవ్యాన్ని నెరవేర్చాడు.

దగ్గరివారికి అడగకుండానే సలహాలు ఇవ్వమని విదురుడు అంటాడు. విదుర్ మహాభారతంలో కీలక భూమిక పోషించాడు. ఆయన జ్ఞానం, విధానాలు నేటికీ అనుసరించబడుతున్నాయి. విదురుడు దార్శనికుడిగా.. గొప్ప జ్ఞానిగా పరిగణించబడ్డాడు. నేటికీ విదురుని విధానాలను ప్రజలు అనుసరిస్తూ జీవితంలో ముందుకు సాగుతున్నారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం..