Rakhi Festival: భద్ర నీడలో రాఖీ.. శుభ సమయం ఎప్పుడంటే.. రాఖీ తీసిన తర్వాత ఏమి చెయ్యాలో తెలుసా..

|

Aug 11, 2023 | 8:50 AM

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం రాఖీ పండగ ముగిసిన తర్వాత.. మర్నాడు రాఖీని తీసివేసి, మీకు, మీ సోదరికి సంబంధించిన ఇతర వస్తువులను ఉంచే ప్రదేశంలో ఉంచండి. మీరిద్దరూ కలిసి ఉన్న చిత్రాలు, మీ బొమ్మలు లేదా మరేదైనా వంటి బహుమతులు పెట్టుకునే ప్లేస్ లో భద్రపరుచుకోండి. దీనిని ఇలా మళ్ళీ ఏడాది రాఖీ పండగ వరకు భద్రంగా ఉంచండి. 

Rakhi Festival: భద్ర నీడలో రాఖీ.. శుభ సమయం ఎప్పుడంటే.. రాఖీ తీసిన తర్వాత ఏమి చెయ్యాలో తెలుసా..
Rakhi Festival
Follow us on

రక్షాబంధన్ హిందూ మతం ప్రధాన పండుగలలో ఒకటి. ఈ పండగను సోదర సోదరీమణుల మధ్య అవినాభావ సంబంధానికి చిహ్నంగా జరుపుకుంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతుల్లో రక్షా సూత్రాన్ని కట్టి వారిని ఆశీర్వదిస్తారు. సోదరులు తమ సోదరీమణులను జీవితాంతం కాపాడుతారని వాగ్దానం చేస్తారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున రాఖీని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఈ తేదీ ఆగస్టు 30 న వస్తుంది. అయితే ఈసారి పౌర్ణమితో పాటు భద్రుడి నీడ కూడా ఉండనుంది. ఈ నేపథ్యంలో భద్ర నీడలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. అలాంటి పరిస్థితుల్లో రాఖీ కట్టడానికి ఆగస్టు 30, 31 తేదీల్లో శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం..

సోదరులకు రాఖీ కట్టడానికి చాలా నియమాలు ఉన్నాయి. అదేవిధంగా రాఖీ కట్టిన తర్వాత వాటిని తీసేందుకు ప్రత్యేక నిబంధనలు పెట్టారు. నిజానికి రాఖీ పండగ ముగిసిన తర్వాత మణికట్టుకు అలంకరించిన రాఖీని ఏమి చేయాలో అనే సందిగ్ధంలో ప్రజలు తరచుగా ఉంటారు. చాలా మంది రాఖీని తీసి ఎక్కడబడితే అక్కడ ఉంచుతారు. అయితే అలా చేయడం సరైనది కాదు. దీని వల్ల దుష్ప్రభావాలు కలుగుతాయి. అటువంటి పరిస్థితిలో సోదరీమణులు కట్టిన తర్వాత రాఖీలను ఏమి చేయాలో తెలుసుకుందాం.

జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం రాఖీ పండగ ముగిసిన తర్వాత.. మర్నాడు రాఖీని తీసివేసి, మీకు, మీ సోదరికి సంబంధించిన ఇతర వస్తువులను ఉంచే ప్రదేశంలో ఉంచండి. మీరిద్దరూ కలిసి ఉన్న చిత్రాలు, మీ బొమ్మలు లేదా మరేదైనా వంటి బహుమతులు పెట్టుకునే ప్లేస్ లో భద్రపరుచుకోండి. దీనిని ఇలా మళ్ళీ ఏడాది రాఖీ పండగ వరకు భద్రంగా ఉంచండి.

ఇవి కూడా చదవండి

విరిగిన రాఖీలను ఏం చేయాలి?

రాఖీని మణికట్టు నుండి తీసే సమయంలో అది చిరిగిపోతే దానిని భద్రపరచకూడదు. లేదా ఎక్కడబడితే అక్కడ విసిరేయకూడదు. దానిని ఒక రూపాయి నాణెంతో పాటు చెట్టు కింద ఉంచాలి. నది నీటిలో కలపాలి.

రాఖీ కట్టడానికి కొన్ని నియమాలు

  1. హిందూమతంలో రాఖీ కట్టడానికి సంబంధించి కొన్ని నియమాలు పేర్కొన్నారు.
  2. సోదరుల మణికట్టుపై సోదరీమణులు ఎప్పుడూ నలుపు రంగు లేదా విరిగిన రాఖీని కట్టకూడదు.
  3. రాఖీ కట్టేటప్పుడు సోదరులు తమ తలను చేతితో పట్టుకోవాలి.
  4. భద్ర కాలంలో రాఖీ కట్టకూడదు.
  5. రాఖీ కట్టేటప్పుడు సోదరులు నేలపై కాకుండా పీటపై కూర్చోవాలి.
  6. రాఖీని కట్టేటప్పుడు, సోదరీమణులు నైరుతి దిశలో ఉండాలి.

రాఖీ కట్టడానికి శుభ సమయం ఏది

ఈ సంవత్సరం, పౌర్ణమి తేదీ ఆగస్టు 30 ఉదయం 10.58 గంటలకు ప్రారంభమై ఆగస్టు 31 ఉదయం 7.05 గంటలకు ముగుస్తుంది. దీంతో ఉదయం 10.58 గంటల నుంచి రాత్రి 09.01 గంటల వరకు భద్రుని నీడ కమ్ముకుంటుంది. భద్ర నీడలో రాఖీ కట్టడం అశుభం. అటువంటి పరిస్థితిలో.. రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం ఆగస్టు 30 రాత్రి 09.01 నుండి ఆగస్టు 31 ఉదయం 07.05 వరకు ఉంటుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం)