Rakhi Festival 2024: రాఖీ పండగ రోజున ఏర్పడనున్న 4 శుభాయోగాలు.. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం

|

Aug 06, 2024 | 11:42 AM

రాఖీ పండగ రోజున సర్వార్థ, రవియోగం ఏర్పడనుంది. ఈసారి ఆగస్టు 19న రాఖీ పండగను జరుపుకోనున్నారు. ఆగస్ట్ 18న రాత్రి భద్ర నీడ ప్రవేశం చేయనుంది. 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం. ఈ సమయంలో రాఖీ కట్టాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయం రాఖీ కట్టడానికి శుభ సమయం.

Rakhi Festival 2024:  రాఖీ పండగ రోజున ఏర్పడనున్న 4 శుభాయోగాలు.. ఈ సమయంలో రాఖీ కట్టడం శుభప్రదం
Rakhi Festival 2024
Follow us on

హిందూ మతంలో సోదర సోదరీమణుల మధ్య ప్రేమకు ప్రతీక అయిన రాఖీ పండగను ప్రతి సంవత్సరం గొప్ప వేడుకలతో జరుపుకుంటారు. ఈ పండుగ రోజున ఒక సోదరి తన సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టి, రక్షణ కోసం వాగ్దానం తీసుకుంటుంది. ఈ ఏడాది రాఖీ పండుగ మరింత ప్రత్యేకంగా ఉండబోతోంది. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం 90 సంవత్సరాల తర్వాత ఈ ఏడాది రాఖీ పండగ రోజున నాలుగు శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ సమయంలో రాఖీ కట్టడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.

పంచాంగం ప్రకారం రాఖీ పండగ రోజున సర్వార్థ సిద్ధి యోగం, రవియోగం, శోభ యోగం, శ్రవణ నక్షత్రాలతో మహా సంయోగం జరుగబోతోంది. ఇలా చేయడం స్వతహాగా చాలా ప్రత్యేకం. సోదరి తన సోదరుడి మణికట్టుకు కట్టే రాఖీ కేవలం రాఖీ మాత్రమే కాదు.. రక్షా సూత్రం అని ఒక నమ్మకం. ఇలా చేయడం వలన సోదరుడికి ఎటువంటి హాని కలగకుండా రక్షణ ఇస్తుందని నమ్మకం. కనుక భద్ర కాలంలో రాఖీని కట్టడం అశుభం. అందుకే ఈ సంవత్సరం రాఖీని కట్టడానికి శుభ సమయం.. మధ్యాహ్నం 1 గంట తర్వాత మాత్రమే. అప్పుడే సోదరుడి మణికట్టుకి రాఖీని కట్టాలి.

రాఖీ పండగ రోజున సర్వార్థ, రవియోగం ఏర్పడనుంది. ఈసారి ఆగస్టు 19న రాఖీ పండగను జరుపుకోనున్నారు. ఆగస్ట్ 18న రాత్రి భద్ర నీడ ప్రవేశం చేయనుంది. 19వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 8 గంటల వరకు రాఖీ కట్టడానికి శుభ సమయం. ఈ సమయంలో రాఖీ కట్టాలని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ సమయం రాఖీ కట్టడానికి శుభ సమయం. ఈసారి శ్రావణ మాసం సోమవారంలో రాఖీ పండగ రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుడి మణికట్టుకి రంగురంగుల పట్టు లేదా పత్తి దారాన్ని కట్టి తన సోదరుడి జీవితం సుఖ సంతోషంగా సాగిపోవాలని కోరుకుంటారు.

ఇవి కూడా చదవండి

రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం

పంచాంగం ప్రకారం ఆగస్టు 19వ తేదీ సోమవారం మధ్యాహ్నం 1:26 నుండి సాయంత్రం 6:25 వరకు రాఖీ కట్టడానికి అనుకూలమైన సమయం. ఈ సమయంలో రాఖీని కట్టడం ద్వారా సోదరులు శ్రేయస్సు, అదృష్టంతో పాటు దీర్ఘాయువు అనుగ్రహాన్ని పొందుతారు. సోదరసోదరీమణుల మధ్య ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది.

మొదటి రాఖీని దేవుడికి సమర్పించండి

రాఖీ పండగ రోజున రాఖీకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ రోజున పూజ ప్లేట్‌లో రాఖీని ఉంచండి. ఈ పవిత్రమైన రోజున దేవునికి మొదటి రాఖీని సమర్పించండి. ఆ తర్వాతే సోదరుడికి రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నదమ్ములు దేవుడి ఆశీస్సులు పొందుతారు. అంతేకాదు రాఖీ రోజున సోదరుడికి హారతిని ఇచ్చి.. నుదుట తిలకం దిద్ది… అక్షతలు వేసి అనంతరం రాఖీని కట్టండి.

సోదరసోదరీమణుల బంధంలో మాధుర్యం

రాఖీ పండగ రోజున సోదరీమణులు దీపం వెలిగించి సోదరునుకి హారతి ఇవ్వండి. హిందూ మతంలో దీపం సానుకూలత, కాంతికి చిహ్నంగా పరిగణించబడుతుంది. దీంతో సోదరసోదరీమణుల మధ్య ప్రేమ జీవితాంతం ఉంటుంది. రాఖీ పండగ శుభ సందర్భంగా తప్పనిసరిగా సోదరుడికి స్వీట్ అందించండి. సోదరులకు కుంకుమ దిద్ది.. రక్షా సూత్రం కట్టిన తర్వాత మిఠాయి తినిపించండి. ఇలా చేయడం వల్ల సోదరసోదరీమణుల మధ్య అనుబంధంలో మాధుర్యం జీవితాంతం నిలిచిపోతుంది.

 

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు