Temple Says Its Hundi Full: వేములవాడ రాజన్న భక్తులకు కొత్త చిక్కు వచ్చిపడింది. దేవాలయంలో భక్తులకు చిల్లర ఇబ్బందులు వచ్చి పడ్డాయి. కానుకలు చెల్లించుకునే దారి తెలియక భక్తజనం ఇబ్బందులు పడుతున్నారు. హుండీలు నిండుకోవడంతో మొక్కులు చెల్లించుకునే దారి తెలియక తికమకపడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే..
రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీలు నిండిపోయాయి. కార్తీక మాసంలో వివిధ ప్రాంతాల నుంచి వేములవాడ ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దీంతో అధిక మొత్తంలో కానుకలు, ముడుపులతో హుండీలు నిండుకున్నాయి. అయితే భక్తులు సమర్పించే కానుకల్లో కరెన్సీ కంటే ఎక్కువగా చిల్లర కాయిన్స్ ఉండటంతో కొత్త ఇబ్బందికి దారి తీసింది.
చిల్లర నాణేలను డిపాజిట్ చేసుకునేందుకు…స్థానిక బ్యాంకులు అంగీకరించకపోవటంతో…చిల్లరంతా హుండీల్లోనే ఉండిపోయింది. దీంతో హుండీలు నిండిపోయాయి. ఇక చేసేదేమి లేక ఆలయ అధికారులు హుండీలను సీజ్ చేశారు. దీంతో కోడె మొక్కుల రాజన్నకు ముడుపులు సమర్పించేందుకు వస్తున్న భక్తులు.. వారి కానుకలు ఎక్కడ సమర్పించాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు.
ఇదే విషయంపై ఆలయ అధికారులు స్పందిస్తూ.. భక్తులు సమర్పించే చిల్లరతో ఎప్పటి నుంచో ఇబ్బందులున్నాయని తెలిపారు. ఏటా హుండీల ద్వారా రాజన్న ఆలయానికి 18 కోట్ల ఆదాయం వస్తే.. 2కోట్ల వరకు చిల్లర నాణేలు వస్తాయని, అయితే, దీనికి త్వరలోనే పరిష్కారం కనుగొంటామని చెబుతున్నారు.
Also Read: