AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premanand Maharaj: మరణించిన బంధువులు కలలో కనిపిస్తే ర్ధం ఏమిటి? పరిహారం ఏమి చేయాలంటే

బృందావనంలోని ప్రసిద్ధ సాధువు ప్రేమానంద్ మహారాజ్ తన ఉపన్యాసం ఇచ్చే సమయంలో తన వద్దకు వచ్చిన భక్తుల సందేహాలను పరిష్కరిస్తూ తరచుగా కనిపిస్తారు. చాలా సందర్భాల్లో భక్తులు మహారాజ్‌ను కొన్ని ప్రత్యేకమైన ప్రశ్నలు అడుగుతారు. అలాంటి ఒక ప్రత్యేకమైన ప్రశ్నను ఒక భక్తుడు ప్రేమానంద్ మహారాజ్ ని అడిగాడు. అయితే ఆ ప్రశ్న అందరికీ ఉపయోగపడేది కావడం విశేషం. అది ఏమిటంటే.. మరణించిన కుటుంబ సభ్యులు మన కలలో కనిపిస్తే.. దానికి అర్థం ఏమిటి? అపుడు ప్రేమానంద్ మహారాజ్ చెప్పిన సమాధానం ఏమిటంటే..

Premanand Maharaj: మరణించిన బంధువులు కలలో కనిపిస్తే ర్ధం ఏమిటి? పరిహారం ఏమి చేయాలంటే
Premanand Maharaj
Surya Kala
|

Updated on: Jun 30, 2025 | 12:29 PM

Share

ప్రేమానంద్ మహారాజ్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు. బృందావనంలోని ఈ సాధువుకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అనుచరులు ఉన్నారు. వీరిలో అనేక మంది ప్రముఖ వ్యక్తులు కూడా ఉన్నారు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మ కూడా ప్రేమానంద్ మహారాజ్ అనుచరులే. చాలా మంది భక్తులు తమ సమస్యలకు పరిష్కారాలను పొందడానికి ప్రతిరోజూ మహారాజ్ వద్దకు వస్తారు. అలాంటి ఒక భక్తుడు మహారాజ్ వద్దకు వచ్చాడు.. అతను.. మహారాజ్ చనిపోయిన బంధువులు మన కలలో వస్తే, దాని అర్థం ఏమిటి అని అడిగాడు.

భక్తుడి ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రేమానంద్ మహారాజ్ ఇలా అన్నారు.. కలలు మూడు రకాల ఉన్నాయి. మొదటి కలలో చనిపోయిన కుటుంబ సభ్యులు కనిపిస్తారు. రెండవది దేవుడు, సాధువులు కనిపిస్తారు. మూడవది ఉనికిలో లేనిదని చెప్పారు. అంతేకాదు ఇంకా కలల గురించి స్వామీజీ మాట్లాడుతూ..

ఇది ఆందోళన కలిగించే విషయమా కాదా?

ప్రేమానంద్ మహారాజ్ మాట్లాడుతూ..ఒక వ్యక్తి మనస్సు తరచుగా చాలా మందితో ముడిపడి ఉంటుంది. ఈ వ్యక్తులు చనిపోయిన బంధువులతో పాటు జీవించి ఉండవచ్చు. చనిపోయిన బంధువులు కలలలో కనిపిస్తే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. మీరు ఏదైనా చెడు చేశారని కాదు.. ఇలా కలలో కనిపించి మీ జీవితంలో చెడు జరగదనే సంకేతం ఇవ్వాలనుకుంటున్నారు. కనుక భయపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి

అటువంటి పరిస్థితిలో ఏమి చేయాలి?

అలాంటి కలలు వస్తే దానధర్మాలు చేయడం అలవాటు చేసుకోండి అని మహారాజ్ అన్నారు. ఈ అలవాటు సాధారణంగా ప్రతి ఒక్కరికీ ఉండాలి. మీరు క్రమం తప్పకుండా నీరు, ఆహారం దానం చేస్తే, ఈ దాన ఫలం పూర్వీకులకు చేరుతుందని ప్రేమానంద్ జీ అంటున్నారు. మీరు చేసే దానాలు పూర్వీకులకు సంతృప్తిని ఇస్తాయని చెప్పారు.

కుటుంబ సభ్యుల మరణానంతరం దానధర్మాలు చేయండి

ఆయన ఇలా అన్నారు పూర్వీకుల సంతోషం కోసమే పిండ ప్రదానం, వంటి కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంటి పెద్దలు జీవించి ఉన్నంత కాలం వారికి సేవ చేయాలి. వారు మరణించిన తర్వాత వారి పేరిట దానధర్మాలు చేయాలి. అప్పుడే వారికీ సద్గతులు ప్రాపిస్తాయని చెప్పారు.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.