Peddagattu Jathara : ఘనంగా ప్రారంభమైన ఆసియాలో రెండో అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు

అంగరంగ వైభవంగా.. కన్నులపండుగగా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు, పసుపు బియ్యం సమర్పిస్తూ..

Peddagattu Jathara : ఘనంగా ప్రారంభమైన ఆసియాలో రెండో అతిపెద్ద లింగమంతుల స్వామి జాతర.. భారీ సంఖ్యలో భక్తులు హాజరు
Follow us

|

Updated on: Mar 01, 2021 | 10:36 AM

Peddagattu Jathara : అంగరంగ వైభవంగా.. కన్నులపండుగగా పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ప్రారంభమైంది. ఈ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. గంపల ప్రదర్శన చేస్తూ, బోనాలు, పోలు ముంతలు, పసుపు బియ్యం సమర్పిస్తూ స్వామివారికి తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు.  భక్తులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటర్లు, డప్పు వాయిద్యాలతో గుట్ట పైకి చేరుకొని మొక్కులు చెల్లిస్తున్నారు. ఈ జాతరకు తెలంగాణ సహా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక రాష్ట్రంల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చారు. దీంతో దూరజ్ పల్లి గుట్ట తోపాటు సూర్యపేట పట్టణంలో భక్తుల సందడి నెలకొంది. ఇసుకేస్తే రాలనంత రద్దీ నెలకొంది. నేడు జాతర లో మంత్రులు జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొననున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

ఈ జాతరకు 300 ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. మేడారం జాతర మాదిరిగానే ఈ జాతర ప్రతి రెండేళ్ల కోసారి నిర్వహిస్తారు. యాదవుల ఇలావేల్పు లింగమంతుల స్వామి, , యలమంచిలమ్మ, గంగమ్మ,, శివుడి సోదరి సౌడమ్మలు పెద్ద గట్టుపై కొలువయ్యారు. తమ సంపదలైన గొర్ల జీవాలను, తమను మృగాల బారి నుంచి కాపాడాలని లింగమంతుల స్వామి ని మొక్కుకుని తమ మొక్కులు తీర్చుకుంటారు యాదవులు. మేడారం మాదిరిగానే రెండేళ్లకు ఒకసారి పెద్దగట్టు జాతర. లింగమంతుల స్వామి జాతర జరుగుతుంది. ఈ జాతర ఆసియాలో రెండో అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి గాంచింది. లింగమంతుల స్వామిని తమ కులదైంగా యాదవులు కొలుస్తారు.

జాతర ఏర్పాట్లను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా చేసింది. మంత్రి జగదీశ్ రెడ్డి అక్కడే ఉంటూ.. జాతర ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు సకల సౌకర్యాలను కల్పించారు. ఈ ఏర్పాట్లకు దాదాపు 10 కోట్లను కేటాయించింది. కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే 10 వైద్య బృందాలు షిఫ్ట్ ల వారిగా 24 గంటల వైద్య సేవలను అందిస్తున్నారు. 1000 మంది మున్సిపల్ సిబ్బంది తో 24 గంటలు శానిటేషన్ పనులు నిర్వహిస్తున్నారు. భక్తులకు ప్రభుత్వం నిరంతర తాగు నీటి సౌకర్యం, విద్యుత్ ఏర్పాటు చేసింది. నిరంతరం 40 సీసీ కెమెరాలు 1500 మంది పోలీసు సిబ్బందితో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. జాతర నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళవలసిన వాహనాలను నార్కెట్ పల్లి వయా నల్గొండ, మిర్యాలగూడ, కోదాడ మీదుగా మళ్లించారు.

Also Read:

ఈ రాశి వారు ఈరోజు ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.. లేదంటే గడ్డు పరిస్థితులు తప్పవు!.. సోమవారం రాశి ఫలాలు ఇలా..

కరోనా ఎఫెక్ట్.. మేడారం జాతరకు తాళం.. సెల్ఫ్ లాక్‌డౌన్ ప్రకటించిన పూజారులు, అధికారులు..

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వాసుల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు