Palm Itching: అరచేతులు దురద పెడితే ధనలాభం కలుగుతుందా?.. దీనికి అసలు కారణం ఇదే..
కొంతమంది అరచేతుల్లో హఠాత్తుగా దురద పెడుతుంటుంది. చాలా మంది సాధారణంగానే దీన్ని పట్టించుకోరు. ఇలా అరచేతులు దురద పెట్టడం శుభసూచకమని కొందరు నమ్ముతుంటారు. మరికొందరేమో ఇలా జరగడం మంచిది కాదంటారు. మరి దీనికి జ్యోతిష్య శాస్త్రంలో ఎలాంటి వివరణ ఉంది. దీని వల్ల ఆర్థికంగా ఆయా వ్యక్తులకు ఏవైనా లాభం ఉంటుందా.. నిజంగానే చేతులు దురద పెడితే ధన లాభం కలుగుతుందా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ సంప్రదాయంలో శకునాలు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి శరీరంతో ముడిపడిన శుభాశుభ సూచనల గురించి తెలియజేస్తాయి. అలాంటి ఒక శకునమే అరచేతిలో దురద రావడం. కొంతమంది అరచేతుల్లో హఠాత్తుగా దురద గమనిస్తారు, కానీ దాన్ని సాధారణంగా పట్టించుకోరు. ఈ దురద శుభమైనదా లేక అశుభమైనదా అనేది ఏ చేతిలో వస్తుందనే దానితో పాటు, వారు స్త్రీలా లేక పురుషులా అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు దీని అర్థం ఏమిటో వివరంగా చూద్దాం.
జ్యోతిష్యం ప్రకారం, పురుషులకు కుడి అరచేతిలో దురద రావడం మంచి ఫలితాలను సూచిస్తుంది. ఇది సానుకూల వార్తలు లేదా ఆర్థిక ప్రయోజనాలకు సంకేతంగా భావిస్తారు. ఉదాహరణకు, అనుకోకుండా డబ్బు లభించడం, లాభాలు ఆర్జించడం, బహుమతులు రావడం లేదా ఊహించని విధంగా సంపద పెరగడం వంటివి జరగవచ్చు.
అయితే, పురుషుల ఎడమ అరచేతిలో దురద రావడం అంత మంచిది కాదని చెబుతారు. ఇది దురదృష్టాన్ని లేదా ఆర్థిక నష్టాన్ని సూచిస్తుందని జ్యోతిష్యం చెబుతోంది. డబ్బు చోరీకి గురికావడం, వృథా ఖర్చులు లేదా అనుకోని రీతిలో నష్టపోవడం వంటివి జరిగే అవకాశం ఉంది. లక్ష్మీదేవి సంపదకు ప్రతీక కాబట్టి, ఎడమ చేతిలో దురద ఆ దేవత అనుగ్రహం తగ్గినట్లు సంకేతంగా చెబుతారు.
స్త్రీల విషయానికొస్తే, ఎడమ అరచేతిలో దురద మంచి సంకేతంగా చూస్తారు. ఇది సంపద లేదా శుభవార్తలకు సూచనగా ఉంటుంది. కానీ కుడి అరచేతిలో దురద వస్తే అది అశుభంగా పరిగణిస్తారు. ఇది ఆర్థిక సమస్యలు లేదా అనవసర ఖర్చులను తెచ్చిపెట్టవచ్చని అంటారు. అయితే, ఎడమ చేతిలో దురద ఆర్థిక లాభం లేదా సానుకూల మార్పులను తీసుకురావచ్చని నమ్ముతారు.